Allu Arjun: పుష్ప2కు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఇప్పటి వరకు ఏ హీరో అంత అందుకోలే
పుష్ప.. పుష్ప రాజ్.. నీ యవ్వ తగ్గేదేలే అంటూ దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఒక్క సినిమాతో అల్లు అర్జున్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసును బద్ధలు చేసింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా సుకుమార్ తెరకెక్కింకించిన ఈ సినిమా.. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అందరికీ ఫేవరెట్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు పార్ట్ 2 తీస్తున్నారు. ఆ విషయం అందరికీ తెలిసందే.
పుష్ప-2 సినిమాలో కూడా అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మికా మందన్నాలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పుష్ప కంటే పుష్ప 2 మరింత బాగుంటుందని అంతా భావిస్తుండగా... పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. పార్ట్ 1 కంటే కూడా సుకుమార్ పార్ట్ 2 పై మరింత దృష్టి పెట్టారట. ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ హిట్టుగా ఈ చిత్రాన్ని మలచాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారుట. పాటలు, డైలాగ్ లతో పాటు అల్లు అర్జున్ క్యారెక్టర్ ను మరింత అందంగా మలుస్తున్నారట. ముఖ్యంగా పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ దృష్టిలో ఉంచుకొని పుష్ప 2 విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటుందట చిత్రబృందం.

పుష్ప ది రూల్ సినిమాను 2024వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని నేరుగా మూవీ టీం యే ప్రకటించింది. పుష్ప2లో భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ లో ఫాహద్ ఫాజిల్ నటిస్తుండగా.. సునీల్, ధనుంజయ్, అనసూయ, విజయ్ సేతుపతి వంటి స్టార్ లు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోట్లలో పారితోషికం తీసుకోబోతున్నాడట.

అయితే ఈ చిత్రంలో హీరోగా చేస్తున్న అల్లు అర్జున్ తన పారితోషికాన్ని ఒక ఫిగర్ లాగా కాకుండా... సినిమాకు వచ్చిన రెవెన్యూలో పర్సంటేజ్ ప్రకారం తీసుకోనున్నాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా పుష్ప2 కోసం జరిగే పూర్తి బిజినెస్ లో 33 శాతం ఐకాన్ స్టార్ కు వచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారంట. అంటే ఈ సినిమాకు వచ్చే థియేటర్, ఓటీటీ, డిజిటల్, డబ్బింగ్, పాటలు, శాటిలైట్... ఇలా అన్నీ కలుపులకొని వచ్చే లాభాల్లో హీరోకు 33 శాతం వచ్చేలా బన్నీ అగ్రిమెంట్ చేసుకున్నాడు.

ఈ లెక్కన పుష్ప 2 సినిమాకు వెయ్యి కోట్ల బిజినెస్ జరిగిందనుకుంటే.. అందులో 33 శాతం అంటే మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు బన్నీ ఖాతాలోకి వెళ్లిపోతాయి. ఇలా ఒక్క సినిమాకే 300 కోట్లకు పైగా డబ్బులు తీసుకున్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ నిలవబోతున్నాడు. ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఓ సినిమా కోసం ఈ రేంజ్ లో పారితోషికం అందుకోలేదు. చూడాలి మరి ఈ సినిమా బిజినెస్ ఏ స్థాయిలో జరుగుతుంది, అసలు అల్లు అర్జున్ ఎంత మొత్తంలో అందుకున్నాడనేది.


Click it and Unblock the Notifications











