అల్లు అర్జున్ కొడుకు తాతలను మించిపోయేలా ఉన్నాడు.. వీడియో వైరల్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాక్ డౌన్ లో ఫుల్ బిందాస్ గా తన చిన్న ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలా.. వైకుంఠపురములో.. సినిమాతో హిట్టు పడగానే సుకుమార్ సినిమాతో ఫుల్ బిజీగా కొనసాగిన బన్నీ ఆ మధ్య ఫ్యామిలీతో ఎక్కువగా గడపలేకపోయాడు. ఇక మొత్తానికి లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు పిల్లలతోనే నా ప్రపంచం అంటున్నాడు.
బన్నీ అల్లరి చేస్తూ చిన్న పిల్లడిలా ఎంజాయ్ చేస్తున్నాడట. ఇకపోతే బన్నీ కొడుకు ఎంత ఎనర్జీగా కనిపిస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఓ మై గాడ్ డాడీ పాటలో చెల్లి ఆర్హతో కలిసి బాగానే సందడి చేశాడు. ఇకపోతే ఆ తరువాత కూడా చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు జూనియర్ స్టైలిష్ స్టార్ ఆల్ రౌండర్ అని తెలుస్తోంది. తల్లి స్నేహాలత రెడ్డి వీడియో తీస్తుండగా ఆరోగ్యవంతమైన సాలాడ్ ఎలా తయారు చేయాలో వివరంగా చెప్పాడు.

ఒక ప్రొఫెషనల్ చెఫ్ మాస్టర్ గా వివరిస్తూ ఆరోగ్యానికి మంచి బలాన్ని ఇస్తుందని తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూస్తుంటే అల్లు అయాన్ డాడీనే కాదు తాతలను కూడా మించి పోయేలా ఉన్నాడని అనిపిస్తోందని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











