హీరో నానికి అల్లు అర్జున్ క్షమాపణలు.. అప్పుడే చెప్పాలని అనుకున్నా అంటూ..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఆ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇక బన్నీ తన బ్రాండ్ ను మరింత పెంచుకున్నాడు అనే చెప్పాలి. ఇక ఎంత ఉన్నత స్థాయికి పెరిగినప్పటికీ కూడా బన్నీ మాత్రం చాలా ఒదిగి ఉంటాడు అని చెప్పవచ్చు. ఇటీవల నేచురల్ స్టార్ నాని కి కూడా అతను ఒక వేదిక పై క్షమాపణలు చెప్పడం విశేషం.

ప్రభాస్ తరువాత బన్నీ
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. నార్త్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా ఎనభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడంతో ప్రభాస్ తర్వాత నార్త్ లో అత్యధిక మార్కెట్ క్రియేట్ చేసుకున్న తెలుగు హీరో గా బన్నీ మంచి గుర్తింపు అందుకున్నాడు. మలయాళం తమిళం ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అందించింది.

'ఇది సార్ నా బ్రాండ్'
బన్నీ బ్రాండ్ వాల్యూ కూడా పుష్ప సినిమాతో పెరిగినట్లు అర్థమవుతుంది. ఇక ఇటీవల పుష్ప సినిమాలో డైలాగ్ ను బన్నీ తన టీ షర్ట్ పై వేయించుకోవడం విశేషం. సినిమాలో 'ఇది సార్ నా బ్రాండ్' అనే డైలాగ్ ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అదే డైలాగ్ ను తన టీ షర్ట్ పై వేసుకొని రౌడీ బాయ్స్ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో దర్శనమిచ్చాడు.

రౌడి బాయ్స్ సక్సెఆ అవ్వాలని..
రౌడి బాయ్స్ డేట్ నైట్ సాంగ్ లాంచ్ లో అల్లు అర్జున్ అలా కనిపించగానే అందరు కూడా విజిల్స్ వేసి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. అయితే ఈ వేడుకలో బన్నీ దిల్ రాజు సోదరుడు కొడుకు అయిన ఆశిష్ రెడ్డి గురించి కూడా మాట్లాడాడు. రౌడి బాయ్స్ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకోవాలని తన ఫ్యామిలీలో ఒక కుటుంబ సభ్యుడు పరిచయం అవుతున్నారు అనే ఒక భావన కలుగుతుంది అని బన్నీ వివరణ ఇచ్చాడు.

అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి..
అయితే ఇటీవల బన్నీ సక్సెస్ అందుకున్న సినిమాల గురించి కూడా చాలా ప్రత్యేకంగా వివరణ ఇవ్వడం విశేషం. పుష్ప సినిమాతో పాటు అఖండ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే సంక్రాంతికి రాబోయే సినిమాలు అన్ని కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని అల్లు అర్జున్ ఫ్రెండ్లీ గా మాట్లాడాడు.

నానికి బన్నీ క్షమాపణ
అయితే హీరో నేచురల్ స్టార్ నాని కి కూడా ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పిన బన్నీ శ్యామ్ సింగరాయ్ సినిమా గురించి మాట్లాడేందుకు తనకు ఇంతకు ముందు సరైన సమయం దొరకలేదు అని అందుకు ప్రత్యేకంగా హీరో నానికి క్షమాపణ చెప్పుకుంటున్నాను అని తెలియజేశాడు. అంతేకాకుండా సినిమా గురించి కూడా బన్నీ మాట్లాడాడు.
Recommended Video

శ్యామ్ సింగరాయ్ సినిమా గురించి..
శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. హీరో నాని సాయి పల్లవి కూడా చాలా బాగా నటించారు. ఇక దర్శకుడు కూడా తన ప్రతిభతో చాలా బాగా ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నట్లు బన్నీ పాజిటివ్ గా వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











