Klin Kaara: రామ్ చరణ్ కూతురికి అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్.. ఎవరెవరూ ఏం ఇచ్చారంటే?

మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా రావడంతో సంతోషం వెల్లువిరిసింది. జూన్ 20న క్లిన్ కారాకు ఉపాసన కొణిదెల జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సుమారు 11 ఏళ్ల తర్వాత మెగా కుటుంబంలో బుల్లి వారసురాలు రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే జూన్ 30న బారసాల నిర్వహించి మెగా ప్రిన్సెస్ కు క్లిన్ కారా అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా క్లిన్ కారాకు ఎంతో విలువైన కానుకలు వచ్చాయి. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

కొణిదెల వంశంలోకి మెగా ప్రిన్సెస్ వచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లు వెరిసింది. మంగళవారం జూన్ 20న తెల్లవారు జామున ముహుర్తం ప్రకారం ఆపరేషన్ ద్వారా పాపను బయటకు తీశారు అపోలో వైద్యులు. తర్వాత బారసారలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఒక్కో సెలబ్రిటీ పలు విలువైన కానుకలను మెగా ప్రిన్సెస్ క్లిన్ కారాకు అందజేశారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బంగారు కాయిన్లను (డాలర్స్) స్పెషల్ డిజైన్ చేయించి బహుమతులుగా పంపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Allu Arjun Special Gift To Ram Charan Daughter Klin Kaara

ఇప్పుడు తాజాగా క్లిన్ కారాకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పంపిన బహుమతిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. క్లిన్ కారాకు బన్నీ ఒక స్పెషల్ బంగారు పలకాన్ని గిఫ్టుగా ఇచ్చాడట. క్లిన కారా పేరు అక్షరాలను బంగారు వర్ణంలో డిజైన్ చేయించిన పలకం అది. అలాంటి పలకాన్ని మెగా ప్రిన్సెస్ కు బారసాల సందర్భంగా అల్లు అర్జున్ బహుమతిగా ఇచ్చాడని అంటున్నారు. ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అయిపోతుంది. దీంతో బన్నీ ప్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఐకాన్ స్టార్ ఐడియా కొత్తగా ఉందని సంబరపడుతున్నారు.

ఇదిలా ఉంటే మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా జన్మించకుముందు నుంచి బహుమతులు వెల్లువ మొదలైంది. చిన్నారి పుట్టకముందు ప్రజ్వల ఫౌండేషన్ ఓ ప్రత్యేకమైన ఊయలను కానుకగా అందించింది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విషయం తెలిసిందే. ఆ ఊయలను ప్రజ్వల ఫౌండేషన్ మహిళలు తయారు చేసినట్లుగా, దాని ప్రత్యేకతలను పోస్టులో పేర్కొన్నారు ఉపాసన. కాగా వుమెన్ ట్రాఫికింగ్ నుంచి బయటపడిన మహిళలకు ప్రజ్వల ఫౌండేషన్ ఉపాధితో పాటు ఆశ్రయం కల్పిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X