‘అల్లు అర్జున్, శ్రీలీలను అరెస్ట్ చేయండి.. క్రిమినల్ కేసు పెట్టి జైల్లో పెట్టండి’
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇపుడు ఎంతైతే ఫేమ్ ని తెచుకుంటున్నాడో అంతే రేంజ్ లో వివాదాల పాలిట కూడా నిలుస్తున్నారు అని చెప్పక తప్పదు. కాగా ఇదంతా అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ రోజు నుంచే మొదలైంది అని చెప్పొచ్చు. కాగా ఇక్కడ నుంచి బన్నీ స్టార్ డమ్ ఏమో కాని ఒక దాన్ని మించి మరో వివాదం తనని చుట్టుకుంటుంది.
కాగా ఇపుడు కూడా మరో షాకింగ్ వివాదంలో తనతో పాటుగా యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా ఇరుక్కుంది. ఇది ఎంతవరకు వెళ్లిందంటే ఇద్దరినీ అరెస్ట్ చేసి తీరాలి అనే రేంజ్ లోకి మారింది. కాగా ఇపుడు మరిన్ని డీటెయిల్స్ లోకి వెళితే అల్లు అర్జున్, శ్రీలీల సినిమాల ఫలితంతో సంబందం లేకుండా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అయితే వీరిద్దరూ చేసిన బ్రాండ్ ప్రమోషన్స్ యువతను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించే విధంగా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థి సంస్థ వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాని డిమాండ్ చేశారు. ఆ వివాదం వివరాల్లోకి వెళితే..

కాగా ఈ నేపథ్యంలో వీరికి భారీ ఆఫర్స్ కూడా చేతిలో ఉన్నాయి. ఇక ఇవి మాత్రమే కాకుండా ఇద్దరూ యాడ్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. ఇపుడు ఇదే వారి కొంప ముంచినట్టు తెలుస్తోంది. కాగా అల్లు అర్జున్, శ్రీలీల చేసిన ఓ కార్పోరేట్ విద్యకు సంబంధించిన యాడ్ తో వీరు వివాదాల్లో ఇరుక్కున్నారు.
ఇద్దరూ కూడా పలు కార్పొరేట్ విద్యా సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్ లుగా మారి విద్యార్థులుని వాటిలో జాయిన్ అయ్యేలా చేస్తున్నారు అని అలా విద్యార్థులు తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అని విజయవాడ కౌన్సిల్ అఖిల భారత్ విద్యార్థి సంఘం వారు ఆరోపిస్తున్నారు.
కాగా అల్లు అర్జున్, శ్రీలీల ఇద్దరినీ అరెస్ట్ చెయ్యాలని అంతేకాకుండా వారిపై క్రిమినల్ కేసు కూడా పెట్టాలి అంటూ సంచలనం రేపిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. మరి వీరిపై ఈ కేసు ఎక్కడ వరకు వెళుతుందో చూడాల్సిందే.
ఆల్రెడీ అల్లు అర్జున్ విషయంలో ఉన్న ఎన్నో తలనొప్పుల్లో ఇదొకటి తన అభిమానులకి యాడ్ అయ్యింది. ఇక ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాని తను చేస్తున్నాడు. ఇక శ్రీలీల విషయానికి వస్తే తనకి ఇంకా హిట్ కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. రీసెంట్ గానే నితిన్ రాబిన్ హుడ్ తో పలకరించింది కానీ ఇది బిగ్ డిజాస్టర్ అయ్యింది.
అలాగే ఈ సినిమా మినహా ప్రస్తుతం తాను హిందీ సినిమాలో ఫుల్ బిజీగా వుంది. యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ కాంబినేషన్లో ఆమె నటిస్తుండగా ఈ సినిమాతో అయినా హిట్ కొట్టాలని శ్రీలీల ఎదురు చూస్తోంది. మరి ఈ బిజీలో తనకి ఈ కాంట్రవర్సీ ఇపుడు షాకింగ్ గా మారింది. మరి వీటిపై అల్లు అర్జున్, శ్రీలీల టీం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











