Pushpa 2: పుష్ప 2 సర్‌ప్రైజ్ లీక్ చేసిన శరత్.. ఆరోజు ఇండియా షేక్ అవడం ఖాయం
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎన్నో రకాల జోనర్లలో పాన్ ఇండియా చిత్రాలు రూపొందుతోన్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తూ బజ్‌ను భారీ స్థాయిలో ఏర్పరచుకుంటున్నాయి. అలాంటి వాటిలో గతంలో వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన 'పుష్ప ది రైజ్'కు సీక్వెల్‌గా వస్తోన్న 'పుష్ప ది రూల్' ఒకటి. ఈ చిత్రంపై అంచనాలు ఆకాశం అంత ఉన్న విషయం తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ తెరకెక్కిస్తోన్న 'పుష్ప ది రూల్' సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహంతో జరుపుతోంది. ఇలా ఇప్పటికే చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయబోతున్నారు. ఇలా ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'పుష్ప ది రూల్' మూవీపై హైప్ అంతకంతకూ పెరుగుతోన్న నేపథ్యంలో దీని నుంచి అప్‌డేట్ల కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఇప్పుడు ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో రాబోతున్న 'పుష్ప ది రూల్' మూవీ నుంచి టీజర్‌ను ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. ఆరోజు ఐకాన్ స్టార్ బన్నీ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ ఈ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక, ఇదే విషయాన్ని ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ కూడా తాజాగా మీడియాకు వెల్లడించి కన్ఫార్మ్ చేసేశారు.

హై రేంజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'పుష్ప ది రూల్' మూవీ నుంచి రాబోయే టీజర్ అంచనాలను మించిపోయేలా ఉంటుందని అంటున్నారు. ఈ వీడియోతో ఏప్రిల్ 8వ తేదీన ఇండియా మొత్తం షేక్ అయిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ - సుకుమార్ కలిసి చేస్తున్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు.


Click it and Unblock the Notifications











