పుష్ప కోసం రంగంలోకి దిగిన అల్లు అర్జున్: స్పెషల్ వీడియో వదిలిన మూవీ యూనిట్

గత ఏడాది 'అల.. వైకుంఠపురములో' అనే చిత్రంతో కెరీర్‌లోనే మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమాను మొదలు పెట్టాడు. దీంతో తొలిసారి పాన్ ఇండియా రేంజ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు బన్నీ. అందుకే ఈ టాలీవుడ్ స్టార్ హీరో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకోవడంతో పాటు చాలా రకాల ప్రయోగాలకు సైతం సిద్ధం అయ్యాడు. అందుకే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతూ వస్తోంది.

నల్లమల అటవీ ప్రాంతం నేపథ్యంతో గంథపు చెక్కల స్మగ్లింగ్ కథాంశంతో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతుంది. దీంతో దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దాన్ని 'పుష్ప.. ద రైజ్' పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ భాగానికి సంబంధించిన దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే రెండో పార్ట్‌ కోసం చిత్రీకరణ వేగంగా జరుపుతున్నారు.

Allu Arjun Starts Dubbing Work for Pushpa Movie

భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప' మూవీపై దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలూ దృష్టి సారించాయి. మాస్ యాక్షన్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి వచ్చిన వీడియోలు, పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇటీవలే విడుదలైన 'దాక్కో దాక్కో మేక', 'శ్రీ వల్లీ' సాంగ్స్‌కు ఓ రేంజ్‌లో స్పందన వచ్చింది. ఫలితంగా ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. అదే సమయంలో ఇప్పటి వరకూ ఉన్న అంచనాలు కూడా ఒక్కసారిగా రెట్టింపయ్యాయి.

'పుష్ప.. ద రైజ్'ను డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను వేగంగా జరుపుతున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. అంతేకాదు, తాజాగా ఇందులో అల్లు అర్జున్ కూడా భాగం అయినట్లు తెలిపింది. ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఐకాన్ స్టార్ డబ్బింగ్ థియేటర్‌కు రావడం.. లోపలకు వెళ్లి డబ్బింగ్ చెప్పడం వంటివి చూపించారు. అంతేకాదు, 'పుష్పరాజ్ తన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్‌తో మిమ్మల్ని థ్రిల్ చేయబోతున్నాడు' అని పేర్కొన్నారు.

'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌ పుష్ప రాజ్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, సునీల్ ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X