Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మొత్తానికి అలా బయటపడ్డ అల్లు అర్జున్ లుక్.. సుకుమార్ భలే స్కెచ్ వేశారే!!
అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబోలో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అల.. వైకుంఠపురములో సక్సెస్ తర్వాత భారీ హోప్స్ నడుమ ఈ సినిమా సెట్స్‌పై కదులుతున్నారు అల్లు అర్జున్.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ లావర్ డ్రైవర్‌గా కనిపించనున్నారని సమాచారం. బన్నీ లుక్ డిఫరెంట్‌గా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. ఊర మాస్‌గా, రఫ్ ఫేస్‌తో బన్నీ కనిపిస్తారని టాక్ బయటకొచ్చింది. అయితే ఊహించని రీతిలో బన్నీ లుక్ రివీల్ కావడంతో ఆయన అభిమానులు సర్ప్రైజ్ అయ్యారు.
శనివారం రోజు అల్లు అర్జున్ బాడీగార్డు పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన బన్నీ గుబురు గడ్డం, ఒత్తైన జుట్టుతో కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అల్లు అర్జున్- సుకుమార్ మూవీలో ఆయన లుక్ ఇదే అని ఫిక్సయ్యారంతా.
ఈ లుక్ చూసి సుకుమార్ గత చిత్రం 'రంగస్థలం'ను గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. 'రంగస్థలం' సినిమాలో రామ్ చరణ్ గుబురు గడ్డంతో కనిపించి కాసుల వర్షం కురిపించారు. అందుకే ఇప్పుడు బన్నీ చిత్రంలో కూడా ఆ సెంటిమెంట్‌నే సుకుమార్ ఫాలో అవుతున్నారని, మొత్తానికి భలే స్కెచ్ వేశారని కామెంట్స్ పెడుతున్నారు.