twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొత్తానికి అలా బయటపడ్డ అల్లు అర్జున్ లుక్.. సుకుమార్ భలే స్కెచ్ వేశారే!!

    |

    అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబోలో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అల.. వైకుంఠపురములో సక్సెస్ తర్వాత భారీ హోప్స్ నడుమ ఈ సినిమా సెట్స్‌పై కదులుతున్నారు అల్లు అర్జున్.

    ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ లావర్ డ్రైవర్‌గా కనిపించనున్నారని సమాచారం. బన్నీ లుక్‌ డిఫరెంట్‌గా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. ఊర మాస్‌గా, రఫ్ ఫేస్‌తో బన్నీ కనిపిస్తారని టాక్ బయటకొచ్చింది. అయితే ఊహించని రీతిలో బన్నీ లుక్ రివీల్ కావడంతో ఆయన అభిమానులు సర్‌ప్రైజ్ అయ్యారు.

    Allu Arjun- Sukumar combo: Bunny Look revealed

    శనివారం రోజు అల్లు అర్జున్ బాడీ‌గార్డు పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన బన్నీ గుబురు గడ్డం, ఒత్తైన జుట్టుతో కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అల్లు అర్జున్- సుకుమార్ మూవీలో ఆయన లుక్ ఇదే అని ఫిక్సయ్యారంతా.

    ఈ లుక్ చూసి సుకుమార్ గత చిత్రం 'రంగస్థలం'ను గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. 'రంగస్థలం' సినిమాలో రామ్ చరణ్ గుబురు గడ్డంతో కనిపించి కాసుల వర్షం కురిపించారు. అందుకే ఇప్పుడు బన్నీ చిత్రంలో కూడా ఆ సెంటిమెంట్‌నే సుకుమార్ ఫాలో అవుతున్నారని, మొత్తానికి భలే స్కెచ్ వేశారని కామెంట్స్ పెడుతున్నారు.

    English summary
    stylish star Allu Arjun has announced a new project with director Sukumar. In this movie Allu Arjun performs in special role. Now his look is revealed during his bodygaurd birthday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X