అల్లు అరవింద్ కొట్టేశాడు.. బన్నీ దూకేశాడు.. సుక్కు క్రియేటివిటీ మొదలైంది
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన కొత్త సినిమాను ప్రారంభించారు. రంగస్థలం సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఆయన తిరిగి మెగా ఫోన్ పట్టారు. అల్లు అర్జున్ హీరోగా కొత్త సినిమా మొదలు పెట్టేశారు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమా ఈ రోజే (అక్టోబర్ 30న) మొదలైంది.
అల్లు అర్జున్ కెరీర్‌లో 20వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమా కొద్దిసేపటి క్రితం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. బన్నీ ఫాథర్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టి సినిమా ప్రారంభించారు. ఈ మేరకు చిత్రయూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. అతిత్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

మరో వైపు అల్లు అర్జున్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల.. వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
గతేడాది బన్నీ సినిమా 'నా పేరు సూర్య' డిసాస్టర్ కావడంతో అల్లు అర్జున్ సూపర్ హిట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. చూడాలి మరి.. త్రివిక్రమ్, సుకుమార్ సినిమాలు అల్లు అర్జున్‌కి ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్స్ ఇస్తాయనేది.


Click it and Unblock the Notifications











