బాలీవుడ్‌లో టాలీవుడ్ డామినేషన్.. మోస్ట్ అవైటెడ్ టాప్ 5 చిత్రాల్లో పుష్పరాజే నెంబర్ వన్!

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఎప్పటికప్పుడు సినిమాలు, సినీ తారలపై సర్వే చేస్తూ ఫలితాలను వెల్లడించే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో నిలిచే సినిమాలు, సినీ తారలు ఎవరో లిస్టు విడుదల చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా బాలీవుడ్ ప్రేక్షుకులు అంతా ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలు లిస్టును ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసింది. అయితే ఈ లిస్టులో టాప్ 1లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా నిలిచింది. హిందీ ప్రేక్షకులు తెలుగు చిత్రం కోసం ఎదురు గమనార్హం.

2024 ఫిబ్రవరి నెలలో హిందీ ప్రేక్షకులు అంతా ఎదురు చూస్తున్న టాప్ 5 సినిమాల లిస్టులో ఏయే చిత్రాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దేశం అంతా ఎదురు చూస్తున్న సినిమాలో నెంబర్ వన్ స్థానంలో పుష్ప 2నే ఉంటుంది. ఇప్పుడు కూడా టాప్ 1లో పుష్ప 2 యే నిలిచింది. 2021లో వచ్చిన పుష్ప సినిమా.. ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వసూళ్లు సాధించిన ఈ సినిమాకు పార్ట్ 2 కోసం కూడా పెద్ద ఎత్తునే ఎదురు చూస్తున్నారు. అయితే పుష్ప : ది రూల్ ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 Allu Arjun Sukumar Pushpa 2 Movie is The Most Awaited Hindi Films Full Details Here

ఇక బాలీవుడ్ సినీ ప్రియులు అంతా ఎదురు చూస్తున్న చిత్రాల్లో టాప్ 2లో హేరా ఫేరి 3 లనిలిచింది. నీరజ్ వోరా డైరెక్షన్ లో రాబోతున్న ఈ కామెడీ సినిమా కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక టాప్ 3లో వార్ 2 నిలిచింది. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతు్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా చేస్తుండగా.. టాలీవుడ్ యంగ్ హీరో కూడా ఇందులో భాగం కాబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది.

 Allu Arjun Sukumar Pushpa 2 Movie is The Most Awaited Hindi Films Full Details Here

ఇక నాలుగో స్థానంలో భూల్ భూలయ్య 3 చిత్రం నిలిచింది. ఇక ఈ సిరీసులో వచ్చిన రెండు చిత్రాలు హిట్ అవ్వగా ఇప్పుడు మూడో చిత్రం రాబోతుంది. హారర్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే నమోదు అయ్యాయి. ఈక్రమంలోనే అనేక మంది ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కాబోతుందో ఇంకా తెలియలేదు. కానీ కచ్చితంగా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక టాప్ 5లో అంటే చివరి స్థానంలో హౌస్ ఫుల్ 5 నిలిచింది. అక్షయ్ కుమార్ తో పాటు అనేక మంది అగ్రతారలు ఈ సినిమాలో నటించబోతున్నారు. ముఖ్యంగా నోరా ఫతేహి, పూజా హెగ్డే, రితేష్ దేశ్ ముఖ్, కృతి సనన్, కృతి కర్బంధా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, మలైకా అరోరా, అభిషేక్ బచ్చన్, జోన్ అబ్రహం, మిథున్ చక్రవతి, రానా దగ్గుబాటి వంటి వాళఅలు కనిపించనున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది, ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X