మొత్తానికి ఒక పని పూర్తి చేసుకున్న 'పుష్ప' టీమ్.. స్పీడ్ పెంచిన సుకుమార్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మొదట బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ మొదటి సారి చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే సినిమాకు సంబంధించిన ఒక కీలక షెడ్యూల్ ను తొందరగానే ఫినిష్ చేశారు.
పడక గదిలో సీన్‌లో రెచ్చిపోయిన అప్సర రాణి.. హాట్ హాట్ ఫోటోలు మీ కోసం
ఇటీవల సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా తప్పకుండా ఈ ఎడాది ఆగస్టు 13న రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇక తక్కువ సమయం ఉండడంతో దర్శకుడు సుకుమార్ అయితే స్పీడ్ పెంచినట్లు క్లారిటీగా అర్ధమయ్యింది. నవంబర్ నుంచి ఇప్పటివరకు రెండు కీలకమైన షెడ్యూల్స్ ను రంపచోడవరం, మారేడు మిల్లి ప్రాంతాల్లో ఫినిష్ చేశారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా తెలియజేశారు. గత ఏడాది షూటింగ్ కు కరోనా గట్టి దెబ్బె వేసింది. అసలే సుకుమార్ చాలా స్లోగా చేసే పనిని కరోనా ఇంకాస్త ఆలస్యం చేసింది. ఇక ధైర్యంగా సినిమాను మొదలు పెట్టినప్పటికి కరోనా భయం ఇంకా తగ్గలేదు. అవుట్ డోర్ షూటింగ్ కు ఈ మధ్య బాగానే బ్రేకులు పడ్డాయి. అయినప్పటికీ తక్కువ సమయంలోనే దర్శకుడు షూటింగ్ ను పూర్తి చేసినట్లు అర్ధమవుతోంది. వీళ్ళ స్పీడ్ చూస్తుంటే సినిమాను అనుకున్న సమయానికి రెడీ చేసేలా ఉన్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











