Jani Master Case.. తప్పుడు ఆరోపణలు చేయొద్దు.. అల్లు అర్జున్ టీం వార్నింగ్
ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమా దగ్గర చాలా వరకు కాంట్రవర్సీలు బాగా వినిపిస్తూ వస్తున్నాయి. అయితే ఏదన్నా కుటుంబాల్లోనో లేకపోతె ఏదొక హీరో మరో హీరోయినే తో అఫైర్ అనో ఇలా చాలానే ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఒక ఊహించని రేంజ్ ఎంటర్టైన్మెంట్ ని కాంట్రవర్సీని అందించింది. అయితే ఇవన్నీ ఒకెత్తు అయితే ఇటీవల ప్రముఖ డాన్స్ మాస్టర్ షేక్ జానీ విషయంలో లేవనెత్తిన కాంట్రవర్సీ మరో ఎత్తు అని చెప్పాలి.
ఇండియన్ సినిమా దగ్గర విజయ్ దళపతి, సూపర్ స్టార్ రజినీకాంత్, షాహిద్ కపూర్, సూపర్ స్టార్ రజినీకాంత్, రామ్ చరణ్ ఇలా ఎందరో బిగ్గెస్ట్ స్టార్స్ తో వర్క్ చేసి నేషనల్ విన్నింగ్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ ఊహించని విధంగా లైంగిక ఆరోపణలు కేసుల్లో ఎదుర్కొన్నాడు. కాగా తనతో వర్క్ చేసిన షష్ఠి అనే అమ్మాయి జానీ మాస్టర్ తనని ఎన్నో ఏళ్ల నుంచి వేధిస్తున్నాడు అని కేసు వేసి సంచలనం రేపింది.

అయితే ఈ కేసు విషయంలో తర్వాత తర్వాతకి పరిస్థితిలు మరోలా మారుతూ వెళ్లాయి. దీనితో ఆమె ఉన్నారని పెద్ద స్టార్ హీరో ఇంకొందరు ఉన్నట్టుగా సంచలన ఆరోపణలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా జానీ మాస్టర్ ఇంకా తాను ఎదుర్కొన్న ఆరోపణలు నిజంగా చేశాడా లేదా అనేది నిర్ధారణ కాకుండానే చేసేసాడు అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు అంటూ జానీ మాస్టర్ భార్య వాపోయారు.
ఇలా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆవిడ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారాయి. అయితే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అలాగే ఊహించని విధంగా దర్శకుడు సుకుమార్ పేరు కూడా తీసుకొచ్చి ఓ వీడియో జానీ భార్య విషయంలో వైరల్ గా మారుతుండగా ఆ వీడియో చూడకుండానే ఈ కాంట్రవర్సీ వెనుక ఇలాంటి పెద్దలు కూడా ఉన్నారా అని చాలా మంది షాకయ్యారు.
కాగా ఈ సంచలన ఆరోపణలపైన అయితే డైరెక్ట్ అల్లు కాంపౌండ్ నుంచే క్లారిటీ వచ్చింది. అల్లు కుటుంబానికి అల్లు అర్జున్ కి పర్సనల్ పిఆర్ శరత్ చంద్ర స్పందించాడు. జానీ మాస్టర్ భార్యపై వచ్చిన ఓ వీడియోలో అసలు అల్లు అర్జున్ కోసం కానీ సుకుమార్ కోసం కానీ ప్రస్తావనే లేదు పైగా ఈ కేసుతో వారికి సంబంధం కూడా లేదు. కానీ అలాంటిది డైరెక్ట్ టైటిల్ లో ఎలా వారి పేర్లు పెడతారు అంటూ ఖండించారు.

దీనితో జానీ మాస్టర్ కేసు విషయంలో అల్లు అర్జున్ కి కానీ సుకుమార్ కి సంబంధం లేదనే ఇప్పుడు అనుకోవాలి. అయితే ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయో కానీ అల్లు అర్జున్ పేరుని కూడా బాగా హైలైట్ చేశారు. ఇప్పుడు సుకుమార్ పేరుని కూడా జోడిస్తున్నారు. మరి ఇదంతా వాంటెడ్ గా జరుగుతుందా లేక వేరే కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే జానీ మాస్టర్ కేసు శరవేగంగా కొనసాగుతుంది. మరి అల్టిమేట్ గా ఎవరు ఈ కేసులో అసలు దోషి ఎవరు నిర్దోషి అనేది తేలాల్సి ఉన్నది.


Click it and Unblock the Notifications











