అల్లు అర్జున్‌కు కరోనా నెగెటివ్: వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్ పోస్ట్

రెండో దశలో కరోనా వైరస్ తెలుగు సినీ ఇండస్ట్రీపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఈ మహమ్మారి బారిన పడ్డారు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకడు. కొద్ది రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్‌గా తేలిన అతడు.. దాదాపు రెండు వారాలుగా ఇంట్లోనో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. తన క్వారంటైన్‌కు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు వెల్లడిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్‌కు కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశాడతను.

కొన్ని రోజులుగా కరోనా బాధ పడుతోన్న అల్లు అర్జున్‌కు తాజాగా జరిపిన పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపిన అతడు.. '15 రోజుల క్వారంటైన్‌లో ఉన్న తర్వాత నాకు తాజాగా కరోనా నెగెటివ్ వచ్చింది. నా ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేసిన ఫ్యాన్స్‌కు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. ఈ లాక్‌డౌన్ కరోనా కేసులను తగ్గించడంలో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. దయచేసి అందరూ ఇళ్ళలోనే ఉండండి.. జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమకు ధన్యవాదాలు' అంటూ ఓ ప్రకటనను విడుదల చేశాడు బన్నీ.

 Allu Arjun Tested Negative for Covid-19

అల్లు అర్జున్‌కు కరోనా నెగెటివ్ రావడంపై ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అతడు సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఇందులో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా చేస్తున్నాడు. అనసూయ భరద్వాజ్ కీలక పాత్రను పోషిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X