Pushpa 2 The Rule : పుష్ప 2 రిలీజ్ .. పవన్‌ కళ్యాణ్‌పై అల్లు అర్జున్ సంచలన ట్వీట్

ప్రస్తుతం అల్లు - మెగా కుటుంబాల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ట్యాగ్ తనకు అక్కర్లేదు అన్నట్లుగా అల్లు అర్జున్ తీరు ఉందని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎవరి వల్ల ఈ స్థాయికి వచ్చారో గుర్తుపెట్టుకుని నడుచుకోవాలంటూ వారు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగుతున్నారు. మెగా ఫ్యామిలీతో గతంలో మాదిరిగా బన్నీ క్లోజ్‌గా ఉండటం లేదంటూ ఫిలింనగర్‌లో గాసిప్స్ వినిపిస్తున్నాయి.

చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ నుంచి తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధికి ప్రచారం చేయడం వరకు అల్లు అర్జున్ చేతలు, మాటలు వివాదాస్పదమవుతున్నాయి. చివరికి ఇవి ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి బన్నీని, అతని కుటుంబాన్ని బాయ్‌కాట్ చేసే స్థాయికి పరిస్థితులు వచ్చాయని చిత్ర సీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్‌లతో ఆయన మునుపటిలా ఉండటం లేదని అంటున్నారు.

allu arjun thanks to ap cm nara Chandrababu naidu and Dy cm pawan kalyan for pushpa 2 the rule ticket price hike

అల్లు అర్జున్ తీరుపై మెగా , పవన్ అభిమానులు తొలి నుంచి కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎపిసోడ్‌తో అది కాస్తా తారాస్థాయికి చేరింది. ఎన్నిసార్లు క్షమించినా, ఎంతగా హితవు పలికినా తీరు మార్చుకోకపోవడంతో మెగా ఫ్యామిలీ సైతం బన్నీపై కఠిన చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగానే జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం సాయిథరం తేజ్ .. అల్లు అర్జున్‌తో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డిని తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో వారిని ఆన్‌ఫాలో చేయడం దుమారం రేపుతోంది.

అయితే ప్రతి సందర్భంలోనూ తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెబుతూనే వచ్చారు అల్లు అర్జున్. షూటింగ్‌లు, ఇతర బిజీ షెడ్యూల్స్ వల్ల మెగా ఫ్యామిలీలో జరిగే ఈవెంట్లకు హాజరుకావడం లేదని కూడా తెలిపాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్ట్ 15న విడుదల కావాల్సిన పుష్ప 2 ఏకంగా డిసెంబర్ 5కి వాయిదా పడింది. మెగా, పవన్ అభిమానులకు భయపడే సినిమా వెనక్కి జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

allu arjun thanks to ap cm nara Chandrababu naidu and Dy cm pawan kalyan for pushpa 2 the rule ticket price hike

రెండ్రోజుల్లో పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్‌ నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని పుష్ప మేకర్స్ టెన్షన్‌లో ఉన్నారు. తెలంగాణలో పుష్ప సినిమా టికెట్ ధరల పెంపుకు, స్పెషల్ షోలకు అనుమతి లభించింది. అయితే ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఎలాంటి నిర్ణయం వస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే పుష్ప 2 టికెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన వెంటనే బన్నీ ఎక్స్ ద్వారా స్పందించారు. చిత్ర పరిశ్రమ కోసం నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే ఇండస్ట్రీ బలోపేతానికి మద్ధతు ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X