ఎన్టీఆర్ ను కాదని మెగా హీరోతో అఖండ ప్రమోషన్స్.. ఆసక్తికరంగా మారిన ప్రీ రిలీజ్ ఈవెంట్

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున జరగబోతున్న సంగతి తెలిసిందే. దానికి హాజరు కాబోయే గెస్ట్ ల విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఒక మెగా హీరో ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరవుతున్న అంశం సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

చాలా కాలం నుంచి

చాలా కాలం నుంచి

నందమూరి బాలకృష్ణ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. చివరిగా ఆయన చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. తన తండ్రి గురించి గొప్పగా చెప్పాను అని బాలకృష్ణ భావించారు కానీ సినిమాలు కమర్షియల్గా మాత్రం సక్సెస్ కాలేకపోయాయి.. అయితే ఆ విషయాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోని బాలకృష్ణ ఎప్పటిలాగే తన సినిమాలను ఖరారు చేసుకునే పనిలో పడ్డారు.

అఖండ మాస్

అఖండ మాస్

అందులో భాగంగానే బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నారు. గతంలో సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అఖండ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో బాలయ్య ఒక లుక్ లో ఘోర మరో లుక్ లో రైతుబిడ్డగా కనిపిస్తున్నాడని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ల, టీజర్ల ద్వారా క్లారిటీ వచ్చింది. అందుకు ఊతమిస్తూ బోయపాటి కూడా సినిమా మీద మరింత అంచనాలు పెంచే విధంగా సినిమా గురించి ఒక్కొక్క లీక్ వదులుతున్నారు.

ఎన్టీఆర్ సహా నాని కూడా

ఎన్టీఆర్ సహా నాని కూడా

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ సహా నాని కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా వారిద్దరూ కాకుండా ఇప్పుడు ఒక మెగా హీరో ఈవెంట్ కు హాజరు అవుతున్నట్లు గా ప్రకటించారు మేకర్స్. అఖండ సినిమా యూనిట్ ప్రకటించిన దాని మేరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాబోతున్నారు.

 ఎన్టీఆర్ ను కాదని

ఎన్టీఆర్ ను కాదని


అల్లు అర్జున్, బోయపాటి శ్రీను తో సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుండగా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే వెలువడ లేదు. ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమా ఫంక్షన్ కు అల్లు అర్జున్ హాజరు కాబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. శిల్పకళావేదికలో నవంబర్ 27వ తారీకు సాయంత్రం 6 గంటలకు జరగబోతున్న ఈ ఈవెంట్ ఇప్పుడు అటు మెగా ఫ్యాన్స్ కు ఇటు నందమూరి ఫ్యాన్స్ కు ఆసక్తికరంగా మారింది.

సినీ ఆదిపత్య పోరు

సినీ ఆదిపత్య పోరు

నిజానికి ముందు నుంచి కూడా నందమూరి మెగా ఫ్యామిలీల మధ్య సినీ ఆదిపత్య పోరు కొనసాగుతూ ఉండేది. అయితే అల్లు అరవింద్ కు సంబంధించిన ఆహా యాప్ లో బాలకృష్ణ హోస్ట్ గా ఒక షో చేస్తూ ఉండడం రెండు కుటుంబాల మధ్య సాన్నినిత్యం పెరిగేలా చేసింది. అలా ఇప్పుడు అల్లు అర్జున్ ను ఈ ఈవెంట్ కు పిలువగా ఆయన హాజరు కాబోతున్నారు.

Recommended Video

Latest Tollywood Updates : Allu Arjun ఖాతాలో ఓ అరుదైన రికార్డు..! || Filmibeat Telugu
 అంచనాలు పెంచే విధంగా

అంచనాలు పెంచే విధంగా

బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ పూర్ణా హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాంత్, జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు కూడా సినిమా మీద అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X