అల్లు అర్జున్- త్రివిక్రమ్ మూవీ టైటిల్ రివీల్.. వెరీ ఇంట్రెస్టింగ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అల్లు అర్జున్ కెరీర్ కి ఎంతో ముఖ్యమైన సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు త్రివిక్రమ్. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ స్మాల్ వీడియోతో స్పెషల్ ట్రీట్ ఇచ్చింది చిత్రయూనిట్.

అల.. వైకుంఠపురములో.. అనే ఆసక్తికర టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ సర్ ప్రైస్ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన టైటిల్ విజువల్‌ మరింత ఆకట్టుకుంటోంది. అంత గ్యాప్ ఇచ్చావేంట్రా అని మురళీ శర్మ అడిగితే.. ఇవ్వలేదు.. వచ్చింది అని అల్లు అర్జున్ అనటం ఆసక్తి కలిగిస్తోంది. అల్లు అర్జున్ గత సినిమా నా పేరు సూర్య తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్. ఆ కోణంలోనే ఈ డైలాగ్ బన్నీ అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపుతోంది.

Allu Arjun- Trivikram Srinivas new movie title released

గతంలో ఈ సినిమాకు నాన్న నేను, అలకనంద, వైకుంఠపురంలో పేర్లలో ఒకటి కన్ఫర్మ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ అలా కాకుండా వాటికి దగ్గరగానే అల.. వైకుంఠపురములో.. అనే టైటిల్ తో సర్ ప్రైస్ చేశారు యూనిట్ సభ్యులు. అల్లు అర్జున్ కెరీర్ లో 19 వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ నటి టబు ముఖ్యపాత్ర పోషిస్తోంది. అలాగే సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X