అల్లు అర్జున్.. జెత్వానీ, శ్రీరెడ్డికి ఎందుకు సపోర్ట్ చేయలేదు? వీళ్లకు ఆఫర్లు ఇస్తావా? ఐకాన్‌ స్టార్‌పై దారుణం

జానీ మాస్టర్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేసిన బాధితురాలికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సపోర్టుగా నిలవడంపై సినీ, అభిమాన వర్గాలు ప్రశంసలు కురిపించాయి. అయితే అలాగే బాధితులుగా మారిన ముంబై నటి కాదంబరీ జెత్వానీ, లైంగిక వేధింపులు, దాడికి గురైన శ్రీరెడ్డికి సంఘీభావం తెలియజేయకపోవడంపై కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ద్వంద ప్రమాణాలు ఎందుకనే విషయాన్ని నిలదీస్తున్నారు. అయితే ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

జానీ మాస్టర్ వద్ద పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆయనపై రేప్ కేసు, మత మార్పిడి ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఆరోపణల నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్, డ్యాన్సర్స్ అసోసియేషన్ సంఘీభావం తెలిపాయి. ఇరు పార్టీల వాదనలు విని ఈ సమస్యకు పరిష్కారం, బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకొంటున్నాయి.

Allu Arjun trolled heavily for not supporting Kadambari Jethwani and Sri Reddy While Supporting Jani Master victim

అయితే తెలుగు ఫిలిం ఛాంబర్‌కు చెందిన లైంగిక దాడి నిరోధక సంఘం సభ్యులు ఈ వివాదంపై మీడియా సమావేశాన్ని నిర్వహించి.. ఇరు పార్టీల వాదనలు విని.. తప్పు జానీ మాస్టర్ తరఫున ఉంటే.. బాధితురాలికి న్యాయం చేస్తామని స్పష్టీకరించారు. ఈ సమయంలోనే యాంకర్ ఝాన్సీ మాట్లాడుతూ.. ఓ పెద్ద హీరో బాధితురాలికి న్యాయం చేయడానికి రెడీ అయ్యారు. తన మేనేజర్ ద్వారా మేసేజ్ చేరవేశాడు. తన సినిమాలో అవకాశం ఇవ్వడమే కాకుండా.. తమ సంస్థలో కూడా ఆఫర్లు ఇస్తామని చెప్పారని తెలిపారు.

అయితే ఝాన్సీ చెప్పిన వెల్లడించిన తర్వాత ఆ పెద్ద హీరో అల్లు అర్జున్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అయితే జానీ మాస్టర్‌ను ఉద్దేశపూర్వకంగానే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే రూమర్లు ప్రచారం జరిగింది. ఈ రూమర్ల ద్వారా తెరపైకి మర్డర్ కేసులో ఇరుక్కొన్న ఫుష్ప ఫేమ్ జగదీష్‌ సపోర్ట్ ఎలా ఇచ్చావు. అతడికి బెయిల్ ఇచ్చి షూటింగ్ ఎందుకు చేసుకొన్నావు అని ప్రశ్నించారు.

Allu Arjun trolled heavily for not supporting Kadambari Jethwani and Sri Reddy While Supporting Jani Master victim

అంతటితో ఆగకుండా నెటిజన్లు ముఖ్యంగా మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఐకాన్ స్టార్‌ను విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు. ఏపీలో వైసీపీ నేతల వల్ల వేధింపులు, అక్రమ అరెస్ట్‌కు గురైన సినీ నటి కాదంబరీ జెత్వానీ విషయంలో ఎందుకు స్పందించలేదు. అలాగే శ్రీరెడ్డి కూడా సినీ పరిశ్రమలోని కొందరిని టార్గెట్ చేసింది. అప్పుడు ఆమెకు ఎందుకు సంఘీభావం ప్రకటించలేదు. ఈ ఇద్దరికి ఎందుకు సినీ అవకాశాలు ఇవ్వలేదు అని నిలదీస్తున్నారు.

ఇండస్ట్రీలో ఎప్పుడూ లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహించే అల్లు అర్జున్.. ఈ విషయంలో చేసింది మంచిదైనా.. ఇతర బాధితులకు సపోర్ట్ చేయకపోవడంపై ట్రోలింగ్ జరుగుతున్నది. పుష్ప జగదీష్ కారణంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడం, ఆ కేసులో సదరు నటుడు జైలుకు వెళ్లడం తెలిసిందే. అలాంటి యాక్టర్‌కు బెయిల్ ఇచ్చి అవకాశం కల్పించిన విషయాన్ని తప్పు పడుతున్నారు. ఈ విషయంపై ఐకాన్ స్టార్ వర్గం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X