నీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది.. త్వరలో కలుద్దాం.. థ్యాంక్యూ బావా : బన్నీ
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. తన మాటలతోనే తెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తాడని మరోసారి నిరూపించాడు. పాతబడిన కథ, ఎన్నోసార్లు చూసిన, విన్న లైన్‌ను పట్టుకుని ఇప్పటి కాలానికి అనుగుణంగా అందరికీ నచ్చే కథనంతో తనదైన శైలిలో తెరకెక్కిస్తూ త్రివిక్రమ్. అల వైకుంఠపురములోనూ అదే జరిగింది. సినిమా మొత్తం త్రివిక్రమ్ మార్క్ కనబడుతూనే ఉంటుంది. మరోవైపు అల్లు అర్జున్ సైతం ప్రత్యేక మ్యానరిజం, మాడ్యులేషన్‌తో ఇరగొట్టేశాడు. ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉన్న అల్లు అర్జున్.. సరైన సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడనిపించుకున్నాడు.

‘అల'పై స్పందించిన ఎన్టీఆర్..
అల వైకుంఠపురములో చిత్రంపై ఎన్టీఆర్ స్పందించాడు. ‘అల్లు అర్జున్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. అల వైకుంఠపురములో చిత్రాన్ని చూడదగ్గ గొప్ప చిత్రంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రాశారు. కంగ్రాట్స్ బావా, సామీ' అని ట్వీట్ చేశాడు.
మురళీ శర్మకు ప్రత్యేకంగా..
‘మురళీ శర్మ అద్భుతమైన నటనకు, తన నటనతో అల్లు అర్జున్, త్రివిక్రమ్‌కు సపోర్ట్ చేసింనందుకు హ్యాట్సాఫ్. ఈ సినిమా తమన్ అందించిన సంగీతం అతి పెద్ద బలం. ఎంతో గొప్పగా తమన్ పనిచేశాడు. సినిమాటోగ్రఫర్ పీఎస్ వినోద్‌కు ప్రత్యేకంగా ప్రశంసించాలి. చిత్రబృందానికి కంగ్రాట్స్, హారిక అండ్ హాసిని ఎంతో బాగా నిర్మించింద'ని చెప్పుకొచ్చాడు.
థ్యాంక్యూ బావా.. త్వరలో కలుద్దాం
ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్‌కు బన్నీ రిప్లై ఇస్తూ.. బావా.. థ్యాంక్యూ వెరీ మచ్.. నీతో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉంది.. త్వరలోనే కలుద్దామంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్‌ను చూసిన ఇరువురు ఫ్యాన్స్ పట్టరాని సంతోషంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా బావా, బావా అంటూ స్టార్ హీరోలు కలిసి ఉండటం, ప్రేమగా మాట్లాడుకోవడం చూస్తే శుభపరిణామేనని కామెంట్లు చేస్తున్నారు.
Recommended Video

ఎమోషనల్ అయిన తమన్..
అల వైకుంఠపురములో చిత్రానికి గానూ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చిన తమన్‌కు ఎన్టీఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. ఈ ట్వీట్‌కు తమన్ రిప్లై ఇస్తూ.. అన్నా మేమంతా నిన్ను లవ్ చేస్తున్నాము.. ఓ పేద్ద.... హగ్ అంటూ ఎమోజీ పెట్టాడు. నీ మాటలకు నా జీవితం ధన్యమైంది.. నా తరుపున, మా టీమ్ తరుపున థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











