twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అరవింద్‌కు లాభాలు బాగా .. తమన్‌కు కోసం ప్రత్యేకంగా బన్నీ ట్వీట్

    |

    చిత్రలహరి సినిమాతో సక్సెస్ బాట పట్టిన సాయి ధరమ్ తేజ్.. ప్రతిరోజూ పండగే చిత్రంతో మరో హిట్ కొట్టాడు. మాస్ మంత్రాన్ని జపించకుండా.. కమర్షియల్ హంగుల జోలికి పోకుండా కథా నేపథ్యమున్న చిత్రాలను ఎంచుకుంటూ విజయాల బాట పట్టాడీ సుప్రీమ్ హీరో. ఈ చిత్రం గత వారం విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి మెగా హీరోల మద్దతు లభించింది.

     స్పందించిన రామ్ చరణ్

    స్పందించిన రామ్ చరణ్

    ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా వీక్షించిన మెగా పవర్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ ఈ చిత్రంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. విలువ‌ల‌తో కూడుకున్న చిత్ర‌మిద‌ని, ఈ చిత్రాన్ని త‌ప్ప‌కుండా అంద‌రూ చూడాల‌ని కోరాడు. మారుతి త‌ను చెప్ప‌ద‌లుచుకున్న విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పాడని అన్నాడు. ఈ విష‌యంలో సాయితేజ్‌, మారుతితోపాటు యూనిట్ మొత్తం త‌మ వంతు శ్ర‌మించిందని అభినందించాడు.

    తాజాగా అల్లు అర్జున్..

    అసలే అల వైకుంఠపురములో షూటింగ్‌తో యమా బిజీగా ఉన్నాడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీ విడుదలలో జాప్యం జరుగుతుందనే వార్తలు వస్తోన్న నేపథ్యంలో మరింత స్పీడ్‌గా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో పడింది యూనిట్. అయితే అల్లు అర్జున్ తాజాగా ప్రతీ రోజూ పండగే చిత్రాన్ని వీక్షించాడు. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

    తన తండ్రికి లాభాలు..

    ప్రతిరోజూ పండగే చిత్రబృందానికి అభినందనలు అంటూ ట్వీట్ చేస్తూ... ఈ సినిమాతో సాయితేజ్‌ హిట్‌ అందుకున్నందుకు, స్నేహితుడు మారుతి విజయం సాధించినందుకు, బన్నీ వాసు ఓ మంచి సినిమాను తన ఖాతాలో వేసుకున్నందుకు, నా తండ్రి మంచి లాభాలను రాబట్టుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు. యూవీ ఫిల్మ్స్‌కు కంగ్రాట్స్‌‌ను తెలిపాడు.

    తమన్ కోసం స్పెషల్ ట్వీట్..

    తమన్ కోసం స్పెషల్ ట్వీట్..

    అల వైకుంఠపురములో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామజవరగమన నుంచి నిన్న రిలీజైన బుట్టబొమ్మ పాట వరకు అన్ని పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.. చేస్తూనే ఉన్నాయి. మ్యూజిక్ సెన్సేషన్‌గా మారిన తమన్‌పై బన్నీ ప్రత్యేక ప్రేమను కనబరిచాడు. ప్రతిరోజూ పండగే చిత్రం విజయం సాధించడంతో.. తన బ్యాంక్‌లో ఇంకో అద్భుతమైన ఆల్బమ్ అంటూ తమన్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపాడు.

    English summary
    Allu Arjun Tweet About Prathi Roju Pandage And Thaman.Congratulations to the Entire team of Prathi Raju Pandage. So glad my cousin Sai Tej has a good hit , my friend Maruthi has a success, My Life Line Vasu has a good film in his account & My Father has more Profits . Congratulations to UV films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X