పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి..అలా తప్పు చేసినట్టే..అల్లు అర్జున్ మామ సంచలన వ్యాఖ్యలు

మెగా ఫ్యామిలీకి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మధ్య కుటుంబ, సినీ వివాదాలు మరో మలుపు తిరిగాయి. గతంలో వారి మధ్య సినీ వారసత్వ పోరాటానికి తెర లేచిందంటూ వార్తలు వినిపించినా.. పెద్దగా వాటికి ప్రాధాన్యం ఏర్పడలేదు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మనోభావాలకు విరుద్దంగా అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతు తెలపడంతో వివాదాలు స్పష్టంగా బయటపడ్డాయి. అదే క్రమంలో ఇటీవల మారుతి నగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మరింత దుమారం రేపాయి. ఈ క్రమంలో ఆయన మామ, అల్లు స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. ఆయన ఏం చెప్పారనే విషయంలోకి వెళితే..

మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమాను సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పిస్తున్నారు. ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానిస్తే.. నేను వస్తానని మాట ఇచ్చాను అని అల్లు అర్జున్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నా ఫ్యాన్స్ నాకు పిచ్చి. ఎవరైనా ఏదైనా హీరో చూసి ఫ్యాన్స్ అవుతారు. కానీ నా ఫ్యాన్స్ చూసి నేను హీరో అయ్యాను. నా ఫ్యాన్స్. నా ఆర్మీ కి లవ్ యూ లవ్ యూ అంటూ ఊగిపోయాడు.

Allu Arjun s uncle Kancharla Chandra Shekar reddy Sensational Comments on Pawan Kalyan over Remarks on Pushpa 2

పుష్ప క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. అంతటి సిచ్యుయేషన్‌లో కూడా రావాలని అనుకొన్నాను. మనకు ఇష్టమైన వారికి మన సపోర్ట్‌ను చూపించాలి. నాకు ఇష్టమైతే నేను వస్తా. నా మనసుకు నచ్చితే వస్తా. అదీ మీ అందరికి తెలిసిందే అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం మెగా క్యాంప్‌ను ఉద్దేశించి చేసినవే అనే అభిప్రాయం మీడియా వర్గాల్లోను, నెటిజన్లలోను వ్యక్తమవుతున్నది.

అయితే అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ భగ్గుమన్నారు. గంగోత్రి సినిమా సమయంలో నీకు ఫ్యాన్స్ ఉన్నారా? నీ ముఖం చూసి ఎవరైనా సినిమాకు వచ్చారా? అంటూ ఆయన వ్యాఖ్యలను ఏకీ పారేశారు. ఇక ముందు ఆయనకు మెగా ఫ్యాన్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదు అని బాహాటంగానే హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ భార్య తండ్రి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం సృష్టించేలా చేస్తున్నాయి.

చంద్రశేఖర్ రెడ్డి ప్రముఖ టెలివిజన్ చానెల్‌తో మాట్లాడుతూ.. నేటి తరం హీరోలు అటవీ సంపదను దోచేసే స్మగ్లర్లుగా నటిస్తున్నారని పుష్ప సినిమాను ఉద్దేశించి పరోక్షంగా పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లను తప్పు పట్టారు. అల్లు అర్జున్ కేవలం నటుడిగా స్మగ్లర్‌గా నటించాడు. నిజంగా ఆయన ఆ వ్యాపారం చేస్తే తప్పుపట్టాలి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పెద్ద మనసుతో నా మాటల వెనుక ఉద్దేశం అది కాదు అని అంటే ఈ వివాదానికి తెర పడుతుంది అని అన్నారు.

ఒకవేళ పవన్ కల్యాణ్ తన మాటలను వెనక్కి తీసుకోకపోతే.. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండి.. నీవు అలాంటి మాటలు మాట్లాడి ఉంటే.. భారత కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టినట్టే. భారత ప్రభుత్వం ఉత్తమ నటుడి అవార్డును ఇస్తే దానిని తప్పుపట్టినట్టే. పవన్ కల్యాణ్ మాటలపై చాలా మంది నాకు ఫోన్లు చేసి ఇలా అనడం ఏమిటి? అని అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్‌పై నాగబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆయన ఏదో ఫ్రస్టేషన్‌తో అని ఉంటారు. ఆంధ్రాలో ఓ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకొన్నారు. అయితే వ్యతిరేక పార్టీలకు చెందిన వారిని కూడా మనవాళ్లే అనుకోవాలి. వారి కోసం కూడా పనిచేయాలి అని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం రేపుతున్నాయి. మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

More from Filmibeat

Read more about: allu arjun pawan kalyan pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X