చిరంజీవినే ఆ సమయంలో వ్యతిరేకించా.. అల్లు అర్జున్ మామ వివాదాస్పద వ్యాఖ్యలు
మెగా, అల్లు ఫ్యామిలీకే పరిమితమైన వివాదాల్లో ప్రస్తుతం మూడో ఫ్యామిలీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు పరోక్షంగా జరుగుతున్న ఈ వివాదానికి అధికారిక ముద్ర వేయడానికి అల్లు అర్జున్ మామ, స్నేహరెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ తలదూర్చడంపై సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. అయితే వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవిని కూడా ప్రస్తావించడంపై మెగా అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ వివరాల్లోకి వెళితే..
మారుతి నగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య ఉన్న విభేదాలను మరోసారి పరోక్షంగా రచ్చకు ఈడ్చాయి. సాధారణంగా హీరోలను చూసి ఫ్యాన్స్ అవుతారు. కానీ నేను నా ఫ్యాన్స్ చూసి నేను హీరోను అయ్యాను. నేను ఎవరి సపోర్ట్ లేకుండానే ఎదిగాను అనే విధంగా మాట్లాడారు.

అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై అల్లు అర్జున్ మరో విధంగా కామెంట్స్ చేశారు. నాకు నచ్చితే ఎవరి వద్దకైనా వెళ్తా. నా మనసుకు నచ్చితే ఎవరికైనా సపోర్ట్ చేస్తాను. అందుకే నేను సుకుమార్ వైఫ్‌కు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాను. గతంలో కూడా ఇలానే చేశాను అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేశాడు.
అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే.. అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల ఓ టెలివిజన్ ఛానెల్ డిబేట్‌లో మాట్లాడుతూ.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్ర గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఆయన మాటలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కించపరిచేలా ఉంది. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అంటూ.. హీరోలు స్మగ్లర్ పాత్రలు వేస్తున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన టార్గెట్ చేశారు.
అంతేకాకుండా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓ పార్టీ అధికారంలోకి వస్తే.. వారికి వ్యతిరేకంగా కొంత మంది ఓట్లు వేస్తారు. అలాంటి ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజలను కూడా ప్రభుత్వం చూసుకోవాలి. వారి ప్రయోజనాలను కాపాడాలి అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇలాంటి విషయాల్లో తలదూర్చి ఇంకా వివాదాన్ని ఝటిలం చేయడం అవసరమా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక టెలివిజన్ చర్చలో మరో ముందుడుగు వేసి.. నేను చిరంజీవి అభిమానిని. నా యంగ్ ఏజ్‌లో మెగాస్టార్ సినిమాలు చూసి ఇష్టపడేవాడిని. చిరంజీవి పార్టీ పెట్టిన సమయంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కానీ ఆ సమయంలో ఆయన పార్టీని, అతడిని వ్యతిరేకించాను. అభిమానం వేరు. ఇష్టం వేరు అంటూ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











