బన్నీ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ఆ పనులు అయిపోతే పుష్ప 1 రెడీ!
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను అందుకున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక సినిమా ట్రెండ్ సెట్ చేస్తే మరో సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక అలాంటి సినిమాల తరువాత పుష్ప 1, పుష్ప 2 ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాయి అనేది ఆసక్తిగా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సుక్కు, బన్నీ పాన్ ఇండియా ఫార్ములాను ఫాలో అవుతున్నారు.
ఈ సినిమాలు ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాయో గాని బజ్ మాత్రం గట్టిగానే ఉంది. నిన్నటివరకు సినిమా నిజంగానే రెండు భాగాలుగా వస్తుందా రాదా అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ కొనసాగింది. ఇక మొత్తానికి నిర్మాత రవి శంకర్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ పనులపై కూడా నిర్మాత ఒక అప్డేట్ అయితే ఇచ్చేశాడు.

పుష్ప పార్ట్ 1 షూటింగ్ ఆల్ మోస్ట్ పూర్తయ్యిందట కేవలం ఒక సాంగ్ చిత్రకరణతో పాటు మరికొన్ని సీన్స్ మాత్రమే షూట్ చేయాల్సి ఉందట. అవి కూడా కరెక్ట్ గా రెండు మూడు వారాలు వర్క్ చేసే ఫినిష్ అవుతాయని నిర్మాత తెలియజేశాడు. ఇక ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు. నిర్మాత చెప్పినాధాన్ని బట్టి చూస్తుంటే సినిమా ఈ ఏడాది చివరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం. ఇక పుష్ప 2 కథ విషయంలో సుకుమార్ మరింత వర్క్ చేయనున్నట్లు సమాచారం. ఆ సినిమా వచ్చే ఏడాది చివరలో రావచ్చని టాక్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











