త్రివిక్రమ్ సాహిత్యం.. బన్నీ గాత్రం.. అదిరిపోనున్న రాములో రాముల
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు కాంబినేషన్‌లో అల వైకుంఠపురములో హ్యాట్రిక్ కాబోతోంది. ఇప్పటికే వచ్చిన చిన్న టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేయగా.. మరోసారి సినిమాపై అంచనాలు పెంచేందుకు సిద్దమయ్యారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో సామజవరగమన అనే పాట సృష్టిస్తోన్న రికార్డులను ఆపగలమా అనేట్టుగా కొనసాగుతోంది. తెలుగు పాటల్లో అత్యధిక లైకులు సాధించిన పాటగా రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ మొదటి పాటే ఇలా ట్రెండ్ అవుతుండగా.. రాములో రాముల అంటూ మరో సెన్సేషన్‌ను వదిలారు.

ఈ పాటకు సంబంధించిన టీజరే ఓ రేంజ్‌లో వైరల్ అవుతోండగా.. నేటి సాయంత్రం పూర్తి వీడియో సాంగ్‌ను వదలబోతోన్నారు. ఈ క్రమంలో ఈ పాటకు మరిన్ని హంగులు అద్దుతున్నట్లు కనిపిస్తోంది. ఈ పాటకు ముందు త్రివిక్రమ్ రాసిన మాటలను, వాయిస్ ఓవర్ రూపంలో పాటకు ముందు యాడ్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ సాంగ్ మరెన్ని రికార్డులను బద్దలుకొడుతుందో చూడాలి. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











