బన్నీ ఆధ్వర్యంలోనే గీత గోవిందం సంబరాలు!
విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం గీత గోవిందం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. బాక్స్ ఆఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తోంది. అల్లు అరవింద్, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఈ చిత్రంలో జంటగా నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీకి యువత ఫిదా అవుతున్నారు.
ఇదిలా ఉండగా ఈ చిత్ర సక్సెస్ సెలెబ్రేషన్స్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆధ్వర్యంలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. బన్నీ స్వయంగా ఈ సెలెబ్రేషన్స్ జరిపించబోతున్నాడట. బన్నీ వాసు, అల్లు అర్జున్ బాగా సన్నిహితులు. తన స్నేహితుడు నిర్మించిన చిత్రం విజయం సాధించడంతో బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆడియో వేడుకకు కూడా బన్నీ ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. గీత గోవిందం చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ప్రతి ఒక్కరిని అలరిస్తోంది.
allu arjun geetha govindam collections mahesh babu geetha govindam vijay devarakonda rashmika mandanna గీత గోవిందం విజయ్ దేవరకోడం రష్మిక మందన


Click it and Unblock the Notifications