Allu Sneha Reddy: నటనా రంగంలోకి అల్లు స్నేహారెడ్డి.. యాక్టింగ్‌ ఇరగదీసిందిగా.. ఎందుకోసమో తెలుసా?

అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందానికి అందం.. అణుకువకు అణుకువ కలగలిపిన ఈ ముద్దుగుమ్మ అంటే అందరికీ ఇష్టమే. స్టైలిష్ స్టార్ భార్యగా తన హుందాను చాటుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది స్నేహారెడ్డి. అలాగే అనేక వ్యాపకాలతో ఎప్పుడూ బిజీగా ఉంటూనే అటు పిల్లలను ఇటు భర్తను, కుటుంబాన్ని చూసుకుంటుంది. తాను స్థాపించిన షికాబు సంస్థకు సంబంధించిన పనులను కూడా చూసుకుంటూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది.

అలా అని కేవలం ఇంటికి, బిజినెస్ పనులకు మాత్రమే అంకితం కాకుండా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అందమైన ఫొటోలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉంటుంది. స్టైలిష్ స్టార్ కు తగ్గట్లుగా అద్భుతమైన ఔట్ ఫిట్లలో దర్శనం ఇస్తూ హీరోయిన్లుకు ఏమాత్రం తగ్గకుండా షో చేస్తుంటుంది. అయితే ఈమె అందాలకు, టాలెంట్ కు చాలా మందే అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే కేవలం బిజినెస్ మాత్రమే చేసే ఈ ముద్దుగుమ్మ నటనా రంగంలోకి అడుగు పెట్టింది.

 Allu Arjun Wife Allu Sneha Reddy Entered Acting Field Check Details

అల్లు అర్జున్ భార్య నటనా రంగంలో అడుగు పెట్టిందనే వార్త ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. నటనారంగం అనగానే చాలా మంది ఏ సినిమాలోనో, వెబ్ సిరీస్ లోనో నటించింది అనుకుంటున్నారేమో.. ఈమె నటించింది ఓ యాడ్ కోసం. అయితే చేసిందే యాడ్ అయినా ఆమె నటనకు మస్త్ మార్కులు పడుతున్నాయి. కళ్లతోనే హావాభావలు పలికిందీ ముద్దుగుమ్మ. బేబీ పింక్ కలర్ డ్రెస్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తూనే.. ఓ బాబుకు తల్లిగా నటించింది. అయితే చాకోస్ గురించి చేసిన ఈ యాడ్ లో స్నేహారెడ్డి అందాలకు అంతా ఫిదా అయిపోతున్నారు.

 Allu Arjun Wife Allu Sneha Reddy Entered Acting Field Check Details

ఓ బాబు గేమ్ ఆడుకుంటూ ఉండగా క్రంచీ సౌండ్ వస్తుంది. దీంతో ఆ బాబు ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. వీడియో గేమ్ నుంచే సౌండ్ వస్తుందేమో అనుకుని చెవి వద్ద పెట్టుకుంటాడు. అప్పుడే స్నేహారెడ్డి కూడా అటూ ఇటూ చూస్తుంది. ఈక్రమంలోనే వీరికి షాకో బన్స్ పాకెట్ కనిపిస్తుంది. దీంతో ఇద్దరి మొహాలు తెగ వెలిగిపోతాయి. ఈక్రమంలోనే అల్లు స్నేహారెడ్డి కళ్లతోనే ఏంటి అన్నట్లుగా అడిగుతుంది. బాబు ఏమీ లేదని చెబుతూనే లేచి నిలబడాతాడు. తల్లి చూస్తుందని ఒళ్లు విరిచినట్లు నటిస్తాడు. ఆపె మెల్లిగా షౌకో చిప్స్ వద్దకు వస్తుంటాడు. అది గుర్తించిన స్నేహారెడ్డి.. అతడికి స్టాప్ చెబుతుంది.

వెంటనే షాకో బన్స్ వద్దకు వచ్చి పాకెట్ విప్పి.. రెండు చాక్లెట్లు ఇచ్చింది. ఈక్రమంలోనే ఈ షాకో చిప్స్ చాలా క్రిస్పీగా, క్రీమీగా ఉన్నాయని చెబుతూ ఓ వాయిస్ ఓవర్ వస్తుంది. ఆ తర్వాత వీరిద్దరూ చెరొకటి నోట్లో వేసుకుని దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ యాడ్ లో అల్లు స్నేహారెడ్డి యాక్టింగ్ నిజంగానే అదిరిపోయింది. మీరు కూడా ఓసారి చూడండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X