Allu Sneha Reddy: అల్లు అర్జున్ పై ట్రోల్స్.. స్నేహారెడ్డి పోస్ట్ వైరల్..

Allu Sneha Reddy:ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయింది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు సోషల్ మీడియాను ఏలేస్తున్నారు. ఇతరుల అభిప్రాయలతో సంబంధం లేకుండా.. ఇష్టం వచ్చినట్టు కామెంట్స్, పోస్ట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎదుటి వ్యక్తి మనోభావాలు దెబ్బతింటాయనే ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లు ట్రోల్స్ చేస్తున్నారు మరికొందరు. ఇక సెలబ్రిటీల విషయంలో సోషల్ మీడియా ధోరణి మరింత దారుణం. సెలబ్రిటీలు ఏ చిన్న పనిచేసిన.. వారిని టార్గెట్ చేస్తూ.. కామెంట్స్, రోల్స్ చేస్తూ ఉంటారు. దీంతో సెలబ్రిటీలకు ప్రైవేట్ స్పేస్ లేకుండా పోతుంది. ఇదిలాఉంటే.. సోషల్ మీడియా వినియోగంపై అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి (Allu Sneha Reddy ) ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

వాస్తవానికి సోషల్ మీడియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వాస్తవాల కంటే పుకార్లే ఎక్కువగా వ్యాప్తిస్తున్నాయి. ఏది నిజమో.. ఏది అబద్దమో.. తెలుసుకోవడం కష్టతరంగా మారింది. ఇక సినిమా సెలబ్రిటీల విషయంలో సోషల్ మీడియా శాపంగా మారిందని చెప్పాలి. సినీ సెలబ్రిటీలు ఏ చిన్న పని చేసిన మరుక్షణం లో వైరల్ గా మారుతుంది. ఎవరితో నైనా సన్నిహితంగా ఉంటే మరుక్షణంలో వారితో లేనిపోని సంబంధాలను అంటగడుతుంటారు. ఇలా సెలబ్రెటీల విషయంలో ఏం జరిగినా మరుక్షణంలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో వారికి పర్సనల్ లైఫ్ లేకుండా పోతుంది.

Allu arjun wife Allu Sneha Reddy recently shared Intresting story on her instrgram about social media

ఒక మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఇటీవల కాలం చోటుచేసుకున్న కొన్ని చర్యలు.. వ్యక్తిగత జీవితాలను బజారున పడేసేలా మారిపోయాయి. ఇక ఇండస్ట్రీలో పుష్ప 2 సమయంలో అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ ఎంతోమంది నెటిజెన్లు యూట్యూబర్లు.. ఇటు అల్లు అర్జున్ ను, అటు ఇండస్ట్రీని ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తూ.. ట్రోల్స్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ మాత్రమే కాకుండా.. తన ఫ్యామిలీ కూడా మానసికంగా ఎంతో కుమిలిపోయిందో తెలిసిందే.. ఈ విషయంలోనే కాదు.. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ జనసేనకు ద్రోహం చేశాడంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్స్ జరిగిన విషయం కూడా తెలిసిందే.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి (Allu Sneha Reddy )తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను పెట్టింది. ఇన్ డైరెక్ట్ గా సోషల్ మీడియాలోని ట్రోల్స్ కు చెక్ పడేలా ఓ ఆసక్తికరమైన పోస్టును నెటిజనులతో పంచుకుంది. ఆ పోస్టులో ' సోషల్ మీడియా కూడా ప్రతి షాప్ లాగా సాయంత్రం 6 గంటలకు మూసివేస్తే ఎలా ఉంటుంది. మనమందరం నిత్యజీవితంలో ఒకరినొకరు కలుసుకోవడానికి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సమయం ఉంటుంది. మన కుటుంబాలతో కలిసి ఉండేవాళ్లం, చదువుకునే వాళ్ళం సంగీతం వినేవాళ్ళం, కలలు నెరవేర్చుకునే వాళ్ళం' అంటూ స్నేహ రెడ్డి రాస్కొచ్చింది. ప్రస్తుతం స్నేహ రెడ్డి పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

Allu arjun wife Allu Sneha Reddy recently shared Intresting story on her instrgram about social media

వాస్తవానికి అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి .. అల్లు ఫ్యామిలీ కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూ.. తన భర్త పిల్లలతో కలిసి సంతోషం తన లైఫ్ ను లీడ్ చేస్తోంది. అలాగే.. సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటూ.. ఆమె తన పిల్లల అల్లరి వీడియోలు, బన్నీతో ఫోటోలని తరుచు తన అభిమానులతో పంచుకుంటుంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో 9.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. సడెన్ గా ఆమె ఇలాంటి పోస్ట్ పెట్టడం వెనుక కారణం ఏంటి ? అనేది నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

ఆమె సడెన్ గా ఇలాంటి పోస్ట్ చేయడంతో అల్లు అర్జున్ పై వచ్చిన విమర్శలకు ఆమె మనసు విరిగిందని, అందుకే ఇలా సోషల్ మీడియాపై విరుచుకపడుతుందని కామెంట్స్ పెడుతున్నారు అల్లు ఫ్యాన్స్. ఏది ఏమైనా సోషల్ మీడియా అనేది వ్యక్తుల సెలబ్రిటీల ప్రైవసీకి భంగం కలిగిస్తుందని చెప్పాలి. వారి జీవితంలో ప్రవేట్ స్పేస్ ను తగ్గిస్తుందని అనడంలో ఎలాంటిసందేహం లేదు. ఇకపోతే అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 2011లో జరిగింది. వీరి అయాన్, అర్హ వంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

More from Filmibeat

Read more about: allu sneha reddy allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X