వెండి రంగు చీరలో మిలమిల మెరిసిన అల్లు స్నేహరెడ్డి.. శారీ ఖరీదేంతంటే?
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాడు. ఇక అతని ఫ్యామిలీ నుంచి కూడా అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా వారి పిల్లలు సతీమణి కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఇక అప్పుడప్పుడు స్నేహ రెడ్డి గ్లామర్ షో తో ఊహించిన విధంగా ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. రీసెంట్ గా ఆమె ఖరీదైన సిల్వర్ కోటింగ్ చీరలో కనిపించి ఆశ్చర్యాన్ని కలిగించారు. దారి ధర ఎంత అనే వివరాలలోకి వెళితే..

ఏదో ఒక విషయంతో
స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా ఐకాన్ స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు అందుకున్న బన్నీ ఇప్పుడు సెకండ్ పార్ట్ తో అంతకుమించి అనేలా రెడీ అవుతున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంతో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటూనే ఉంటాడు.

ఆమెకు కూడా ఫ్యాన్ ఫాలోవర్స్
ఇక అల్లు అర్జున్ భార్య సతీమణి అల్లు స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆమె అప్పుడప్పుడు బన్నీ ఫ్యామిలీతో ఉన్న గుడ్ మూమెంట్స్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక డిఫరెంట్ ఫోటో షూట్ తో కూడా స్నేహ రెడ్డి ఎట్రాక్ట్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా మరోసారి చీరలో కనిపించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది.

సిల్వర్ చీరలో ఫొటో షూట్
స్నేహ ఇటీవల సిల్వర్ కార్డ్ స్ట్రాప్‌లెస్ ట్యూబ్ బ్లౌజ్ ఉన్న వెండి చీరతో అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అది నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయింది. ప్రముఖ డిజైనర్ రిమ్జిమ్ దాదు రూపొందించిన ఈ చీరను మెటాలిక్ కార్డ్స్ తో తయారు చేశారు. అందులో స్నేహం ఎంతో అందంగా ఉన్నారు.

చీర ధర ఎంతంటే?
ఇక ఆ చీర కూడా చాలా ఖరీదైనది అని తెలుస్తోంది. షిప్‌మెంట్‌కు ముందు చీర ఖరీదు రూ.1,76,000 అని తెలుస్తోంది. ఖరీదైన చీరలో స్నేహ గ్లామర్ తో మైమరిపిస్తోంది. ఇక ఆ ఫొటోను చూసిన ఫ్యాన్స్ కూడా చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఆమె ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ యువ హీరోయిన్స్ తరహాలో కనిపోయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంటున్నారు.

పుష్ప 2తో బిజీగా బన్నీ
ఇక మరోవైపు అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు సుకుమార్ రెగ్యులర్ షూటింగ్ కు ప్లాన్ మొత్తం రెడీ చేశాడు. సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి 2023 చివరలో లేదా 2024 మొదట్లో పుష్ప 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అలాగే అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఒక సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. ఇక వేణు శ్రీరామ్ తో కూడా ఐకాన్ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న క్రేజ్ దృష్ట్యా బన్నీ ఆ సినిమాను క్యాన్సిల్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











