అల్లు అర్జున్ జైలుకు వెళ్లినా.. భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియా పోస్ట్, కామెంట్ వైరల్

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా వైడ్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా పుష్ప 2 అయితే ఆ సినిమా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా నేషనల్ వైడ్ గా వైరల్ గా మారాడు. కాగా అల్లు అర్జున్ హీరోగా బిగ్ స్క్రీన్స్ పైనే కాకుండా ఊహించని రీతిలో తాను పుష్ప 2 రిలీజ్ తోనే బయట జరిగిన కొన్ని ఊహించని పరిణామాలు రీత్యా చేయని తప్పుకి దోషిగా నిలబడాల్సి వచ్చింది.

కాగా పుష్ప 2 రిలీజ్ కి ముందు రోజే హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన విషాదంలో రేవతి అనే యువతి చనిపోవడం అదే సమయంలో శ్రీతేజ్ అనే బాలుడు కూడా తొక్కిసలాటకి గురయ్యి ఇప్పటికీ కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతూ బతికేందుకు పోరాడుతున్నాడు. అయితే ఇలా గత ఏడాది అల్లు అర్జున్ తాను సినిమాతో ఇండియన్ ఇండస్ట్రీ హిట్, మొదటి 1000 కోట్లు, 1500 కోట్లు పైగా వసూళ్లు అందుకున్నాడు అనే ఆనందం లేకుండా పోయింది.

allu arjun wife positive post on last december even his arrest in same month

పైగా జైలు, పోలీస్ స్టేషన్ అంటూ కెరీర్ లో ఎప్పుడూ చూడని విధంగా అల్లు అర్జున్ లో మూమెంట్స్ ని చూడాల్సి వచ్చింది. అయితే అల్లు అర్జున్ జైలుకి వెళ్లే ముందు అలాగే వచ్చిన తర్వాత కూడా తన భార్య అల్లు స్నేహ రెడ్డిని ఆప్యాయంగా హగ్ చేసుకున్న విజువల్స్ అమితంగా వైరల్ అయ్యాయి.

కాగా అల్లు అర్జున్ లాంటి ఓ స్టార్ హీరో పైగా తన భర్త గత డిసెంబర్ లో జైలుకి వెళ్లినప్పటికీ అల్లు స్నేహ దానిని పెద్దగా పట్టించుకోకుండానే తన డిసెంబర్ నెల ఎంతో బాగుంది అన్నట్టుగా పోస్ట్ చేయడం ఇపుడు వైరల్ గా మారింది. తనవి అలాగే తన పిల్లలు సహా అల్లు అర్జున్ తో కలిపి ఉన్న పోస్ట్ లు కొన్ని షేర్ చేసుకొని స్నేహ గత డిసెంబర్ నెలలో అన్ని మూమెంట్స్ తనకి ఒక దగ్గర దక్కాయి అంటూ పోస్ట్ చేసింది.

allu arjun wife positive post on last december even his arrest in same month

దీనితో తన భర్త లైఫ్ లో జరిగిన దారుణ అవమానంని ఆమె పట్టించుకోలేదా లేక నెగిటివిటీ తీసుకోకుండా కేవలం పాజిటివిటీ మాత్రమే తీసుకుందా అనిపిస్తుంది. కానీ ఏ కుటుంబంలో మాత్రం అలాంటి నైట్ మేర్స్ లాంటివి జరిగితే హ్యాపీగా ఉంటారు చెప్పండి? అయినా స్నేహ ఇలాంటి పోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారింది అని చెప్పాలి.

అయితే దీనిపై ఫాలోవర్స్ మాత్రం తమ కుటుంబం ఎల్లపుడూ హ్యాపీ గానే ఉంటారని తమ ప్రేమని కురిపిస్తున్నారు. ఇక ఇవి పక్కన పెడితే అల్లు అల్లు నేడు శ్రీతేజ్ ని కలవనుండగా రీసెంట్ గానే బన్నీ పుష్ప రాజ్ లుక్ ని బయటకి వచ్చి నెక్స్ట్ సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. అలాగే తన తదుపరి సినిమాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో భారీ మైథలాజి బ్యాక్ డ్రాప్ సినిమా చేయనున్నట్టుగా తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X