హాస్పిటల్‌ బెడ్‌పై ఆ కండీషన్‌లో .. ఫోటోతో షాకిచ్చిన అల్లు స్నేహారెడ్డి, ఆందోళనలో అల్లు ఫ్యాన్స్

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కెరీర్‌లో పీక్స్‌లో ఉన్నారు. పుష్ప 2తో బాలీవుడ్ స్టార్స్‌కు సైతం సాధ్యం కానీ రీతిలో కలెక్షన్ల వర్షం కురిపించి రికార్డుల్లోకెక్కారు. తెలుగు హీరోలలో ఇప్పటి వరకు ఏ నటుడు సాధించని జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకుని చరిత్ర సృష్టించారు అల్లు అర్జున్. ఇక ఎవ్వరూ ఊహించని రీతిలో అరెస్ట్ అయి, జైలు వరకు వెళ్లొచ్చారు. అల్లు అర్జున్ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఆయనకు తోడుగా నిలుస్తున్నారు ఐకాన్ స్టార్ సతీమణి అల్లు స్నేహారెడ్డి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే స్నేహ తాజాగా షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌కు చెందిన విద్యాసంస్థల అధినేత కుమార్తె స్నేహారెడ్డి. అల్లు అర్జున్ తొలిసారిగా ఆమెను ఓ ప్రైవేట్ పార్టీలో కలిశారు. అలా వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల్లో ఈ విషయం చెప్పగా.. స్నేహారెడ్డి తండ్రి ఈ పెళ్లికి అంగీకరించలేదట. సినీ నేపథ్యం ఉన్న అబ్బాయికి తన కూతురిని ఇచ్చేది లేదని మొండిపట్టు పట్టారట. అయితే అల్లు అర్జున్ వ్యక్తిత్వం, మంచితనం నచ్చి స్నేహారెడ్డితో పెళ్లి జరిపించడానికి ఆయన అంగీకరించారట. ఇరు కుటుంబాల అంగీకారంతో 2011 మార్చి 6న హైదరాబాద్‌లో అల్లు అర్జున్ - స్నేహారెడ్డిల వివాహం ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు వీరి పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

allu arjun wife sneha reddy Instagram post goes viral

2014లో అల్లు అర్జున్ దంపతులకు అయాన్ జన్మించగా.. 2016లో అర్హ పుట్టింది. సినిమాలు, షూటింగ్స్, ఇతర పనులతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయిస్తారు అల్లు అర్జున్. వీలున్నప్పుడల్లా ఫారిన్ వెకేషన్‌కు వెళ్తుంటాడు. ఇక భర్త వృత్తి జీవితంలో బిజీగా ఉండటంతో పిల్లలు, కుటుంబం బాధ్యతను స్నేహారెడ్డి తీసుకుని అల్లు కుటుంబానికి కోడలిగా మంచి పేరు తీసుకొచ్చారు. కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ తనకు అండగా నిలుస్తున్న భార్య అంటే అల్లు అర్జున్‌కు ఎంతో ఇష్టం, ప్రేమ.

సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో స్నేహారెడ్డి షాకయ్యారు. ఇంటికి పోలీసులొచ్చి భర్తను అరెస్ట్ చేయడంతో ఆమె భయాందోళనలకు గురయ్యారు. దీంతో భార్యను ఓదార్చి ధైర్యం చెప్పారు అల్లు అర్జున్. ఇక పోలీస్ స్టేషన్‌కు వెళ్లే ముందు భార్య స్నేహారెడ్డికి హగ్ ఇచ్చి ముద్దు పెట్టి బయల్దేరారు. భర్త వచ్చే వరకు స్నేహ టెన్షన్‌తోనే గడిపారు. బెయిల్‌పై ఇంటికి రాగానే భార్యా బిడ్డలను ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు అల్లు అర్జున్.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అల్లు స్నేహారెడ్డి.. ఎప్పటికప్పుడు తన కుటుంబం, వ్యక్తిగత విషయాలు, అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన వివరాలను పంచుకుంటూ ఉంటారు. అలాగే లేటెస్ట్ ఫోటోలతోనూ ఆమె దుమ్మురేపుతుంటారు. తాజాగా స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్టోరీ వైరల్ అవుతోంది. హాస్పిటల్‌లో ఓ అమ్మాయికి బ్లడ్ ఎక్కిస్తున్నట్లుగా ఓ ఫోటో షేర్ చేశారు. నాకు ప్రస్తుతం ఏం కావాలంటే అంటూ దీనికి క్యాప్షన్ కూడా పెట్టింది. ఆ బ్లడ్ ప్యాకెట్‌పై ట్రావెల్ అని రాసుంది. దీనిని చూసిన అల్లు అభిమానులు అల్లు కుటుంబంలో ఎవరికైనా ఏమైనా అయ్యిందా అంటూ టెన్షన్ పడుతున్నారు.

More from Filmibeat

Read more about: allu arjun sneha reddy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X