బన్నీ పిల్లలు ఇంత క్రియేటివిటీగా ఉండటానికి కారణం ఇదా? పెద్ద ప్లానే..
అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీ భార్యగానే అందరికీ పరిచయమైన స్నేహా.. తర్వాత్తర్వాత తనకంటూ ప్రత్యేకత ఉండేలా చూసుకుంటూ గుర్తింపు సాధించారు. వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టారు. పిల్లల కోసమే ప్రత్యేకంగా ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. పికబు అంటూ చిన్నారుల అవసరాలు, వారి ఆట వస్తువులు, వారిలో క్రియోటివిటీని పెంచేలా, వారిని ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేలా చేసే పలు ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు.
అల్లు అర్జున్ సతీమణిగానే పరిచయమైన స్నేహా.. నెట్టింట్లో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లకు దగ్గరయ్యారు. తన సోషల్ మీడియా అకౌంట్లో తరచూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియా యూజర్లతో టచ్ లో ఉంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు అయాన్, అర్హలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను పోస్టు చేస్తున్నారు. అలా బన్నీ ఫ్యాన్స్ చాలా మంది స్నేహాను ఫాలో అవుతూ.. అల్లు అర్జున్ కు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుంటారు. మిగతా హీరోల భార్యలు చాలా మంది సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. కానీ స్నేహా మాత్రం అలా కాకుండా.. యాక్టివ్ గా ఉంటూ మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.

తాజాగా అల్లు స్నేహా పిల్లల పెంపకం గురించి ఓ వీడియోను తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసుకున్నారు. ఈ తరం పిల్లలు అయితే చదువులు లేదా ఇంటికి వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. తల్లిదండ్రులు కూడా అల్లరి చేయకుండా ఒక దగ్గర కూర్చుని ఫోన్ చూస్తుండటంతో తలనొప్పి తగ్గిందని స్మార్ట్ ఫోన్లు అలవాటు చేస్తుంటున్నారు. దీని వల్ల పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతోంది. క్రియేటివిటీ లోపిస్తోంది. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి, వారికి ఫిజికల్ యాక్టివిటిని పెంచడానికి స్నేహా కొన్ని టిప్స్ ఇచ్చారు ఈ వీడియోలో.
మొత్తం 6 పాయింట్లను తల్లిదండ్రులకు సూచించారు అల్లు స్నేహా. వాటిని పాటిస్తే పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. పిల్లలను ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఉండాలని, క్రియేటివ్ గా ఆలోచించాలని ప్రోత్సహించాలని మొదటి పాయింట్ చెప్పారు. వారం పాటు షెడ్యూల్ ప్రిపేర్ చేసి దానిని ఫాలో అవాలని, దీని వల్ల పిల్లల్లో క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. ఆరు బయట ఆడుకోనివ్వాలి, ప్రకృతి నుంచి కొత్త విషయాలు తెలుసుకోనివ్వాలి. ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ చూసే సమయాన్ని తగ్గించాలి. ఆలోచనా శక్తి పెంచుకునేలా ఎంకరేజ్ చేయాలి. జాలి, దయతో ఉండాలని వారికి నేర్పాలి. అలాగే మిగతా అన్ని పాయింట్లతో సమానమైన ప్రాముఖ్యత ఇవ్వాల్సింది ఆరో పాయింట్. అదే తమకు తాము కొంత సమయాన్ని కేటాయించుకోవడం.

అర్హ, అయాన్ ఆడుకుంటున్న వీడియోలతో కలిసి ఈ పాయింట్స్ తో తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పారు స్నేహా. ఇందులో అర్హ ముద్దు ముద్దుగా ఆడుకుంటూ కనిపించింది. అయాన్ ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించగా, అర్హ కింద పడ్డ పూలను ఏరుకుంటూ కనిపించింది.


Click it and Unblock the Notifications











