Just In
Don't Miss!
- Finance
కేంద్ర బడ్జెట్ యాప్, ఆ తర్వాతే అందుబాటులో డాక్యుమెంట్స్
- News
SP Balu "భారత రత్నం" కాడా..? పద్మవిభూషణ్‌తో సరిపెట్టిన కేంద్రం
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరోసారి అడవుల్లోకి వెళ్లనున్న అల్లు అర్జున్: పరిస్థితి చక్కబడడంతో అలా ప్లాన్ చేశాడు
గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో వెంటనే లెక్కల మాస్టారు సుకుమార్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. 'ఆర్య', 'ఆర్య2' తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమే 'పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగ, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందనుంది. ఈ చిత్రం షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైనా.. అనివార్య కారణాలతో అది కాస్తా ఆగిపోయింది.
పుష్ప సినిమా షూటింగ్ జనవరి రెండో వారం నుంచి ప్రారంభం కాబోతుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని కోసం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి చిత్ర బృందం చేరుకోనుంది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ జనవరి 7వ తేదీన అక్కడకు చేరుకుంటాడని తెలుస్తోంది. ఇటీవల ఈ మూవీ సెట్‌లో కరోనా కలకలం రేగడంతో షూటింగ్ నిలిపివేశారు. ఈ సారి ఎన్నో జాగ్రత్తలతో సినిమా షూటింగ్ జరపాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందుకోసం ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ముందుగానే కోవిడ్ టెస్టులు చేయించబోతున్నారని తెలిసింది.

ఇదిలా ఉండగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని అతడి గెటప్‌కు సంబంధించిన లుక్ లీకైంది. అలాగే, ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. వీరితో పాటు పలు పరిశ్రమలకు చెందిన స్టార్లు ఈ సినిమాలో భాగం కాబోతున్నారు. మారేడుమిల్లి షెడ్యూల్ తర్వాత చిత్ర యూనిట్ వారణాసి పయనం అవుతుంది. అక్కడ ఓ ఐటమ్ సాంగ్‌ను షూట్ చేయనున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.