బిగ్ డే అంటూ అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్: వాళ్లందరికీ కంగ్రాట్స్ చెబుతూ పోస్ట్

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ ప్రొడ్యూసర్లలో అల్లు అరవింద్ ఒకరు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌ ద్వారా సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో చిత్రాలను నిర్మించిన ఆయన.. మైలురాళ్లను అందుకున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది 'ఆహా' పేరిట తెలుగులో మొట్టమొదటి ఓటీటీ సంస్థను కూడా ప్రారంభించారు. దీని ద్వారా ఎన్నో చిత్రాలు, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తూ ప్రేక్షకులను మైమరపిస్తున్నారు. ఇక, దీని ప్రస్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా భాగం అవుతూనే ఉన్నాడు. మొదటి నుంచీ ఆహా వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ట్వీట్ చేశాడతను.

ఫిబ్రవరి 8తో ఆహా వీడియో సంస్థ ఏడాదిని పూర్తి చేసుకుంది. దీనిని పురస్కరించుకుని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'ఈరోజుతో ఆహా వీడియో సంస్థ ఏర్పాటు చేసి ఒక సంవత్సరం పూర్తయింది. ఈ ఏడాది కాలం అందరికీ వినోదాత్మకమైన ప్రయాణం. ఈ స్పెషల్ డే సందర్భంగా ఆహాలో పని చేస్తున్న వాళ్లందరికీ కంగ్రాట్స్' అంటూ ఓ ట్వీట్ చేశాడు బన్నీ. ఈ మెగా హీరో చేసిన పోస్టుకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక, ఈ సంస్థ కోసం ఇప్పటికే ఓ ప్రకటనలో నటించిన అతడు.. కొందరు కొత్త డైరెక్టర్లు, నటీ నటులను కూడా పరిచయం చేస్తున్నాడు.

Allu Arjun Wish Aha Team for 1st anniversary

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో రూపొందిస్తోన్నారు. పాన్ ఇండియా రేంజ్‌తో వస్తున్న ఇందులో కన్నడ పిల్ల రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కొంత భాగం పూర్తయింది. ఇటీవలే తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి, రంపచోడవరం అటవీ ప్రాంతాల్లో దీన్ని చిత్రీకరించారు. ఇక, ఈ సినిమాను ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X