ఆ ఇద్దరి కళ్లలో గర్వం.. అలాంటి ఆనందం చూశా.. రాంచరణ్‌కు కవలలుపై అల్లు అర్జున్ ట్వీట్

మెగా ఫ్యామిలీలోకి ఇద్దరు కవల పిల్లలు అడుగుపెట్టడంపై అభిమానుల్లోను, సినీ వర్గాల్లోు ఆనందం ఆకాశాన్నంటింది. శనివారం రాత్రి పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన రాంచరణ్, ఉపాసన కామినేని కొణిదెల దంపతులకు అన్ని వర్గాల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో పండుగ వాతావరణం నెలకొన్నది. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫ్యాన్స్ బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకొన్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆయన ముఖంలో వారసుడు వచ్చాడనే గర్వం స్పష్టంగా కనిపించింది. మెగా కుటుంబానికి వారసుడు రాకను ఆయన స్వాగతించారు. ఈ శుభ క్షణాలను ఆయన తన స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పంచుకొన్నారు. ఇలాంటి వాతావరణంలో అల్లు అర్జున్ తాజాగా చిరంజీవి, రాంచరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. ఐకాన్ స్టార్ చేసిన ట్వీట్ వివరాల్లోకి వెళితే..

Allu Arjun Wishes to Ram Charan Upasana

రాంచరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులైనందుకు కంగ్రాట్యులేషన్స్. కవలల పుట్టుక మెగా ఇంటిలో ఆనందం వెల్లివిరుస్తూ సంబరాలు చోటుచేసుకోవడం ఆనందంగా ఉంది. చిరంజవి, చిట్టిక్క ముఖంలో గర్వం తొణికిసలాడటం, అలాగే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి కాడం కనిపించింది. మెగా కుటుంబంలోని ప్రతీ ఒక్కరి ముఖంలో సంతోషం కనిపిస్తుండటం హ్యాపీగా ఉంది. చిన్నారులిద్దరి రాకతో ప్రపంచం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. డబుల్ లవ్, డబుల్ జాయ్, సరికొత్త ఆరంభం అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఈ శుభ సందర్బాన్ని పురస్కరించుకొని వారికి శుభాకాంక్షలు అందజేశారు.

అయితే దాదాపు ఒకటిన్నర రోజుల తర్వాత అల్లు అర్జున్ ట్వీట్ చేయడం గమనార్హం. ఆయన దుబాయ్‌లో తన సోదరుడు అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు. అందుకోసం భార్య స్నేహారెడ్డి, పిల్లలతో కలిసి దుబాయ్‌కి వెళ్లారు. ఈ కారణంగా ఆయన ఈ విషయంపై స్పందించడం కొంత ఆలస్యమై ఉండొచ్చు అని ఫ్యామిలీ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, అల్లు శిరీష్, నైనిక పెళ్లి సంబరాలు ఘనంగా దుబాయ్‌లో మొదలయ్యాయి. అల్లు బాబీ, అర్జున్, అరవింద్ కుటుంబాలు దుబాయ్‌లో జరిగిన ఫోటోషూట్‌లో మెరిసారు. వారి పెళ్లి సంబురాలకు సంబంధించిన ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీలోకి ఇద్దరు కవల పిల్లలు ఎంట్రీ ఇవ్వడంతో వారి కుటుంబాల్లో ఆనందం రెండితలైంది.

More from Filmibeat

Read more about: allu arjun ram charan chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X