అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా లేదుగా.. ప్రధాని మోదీ రీల్‌లో AA23 థీమ్ సాంగ్!

AlluArjun-PM Modi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సిరీస్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌తో పాన్ ఇండియ‌న్ హీరోగా మారిపోయాడు. ఎలా అంటే.. పుష్ప 2 సినిమా తెలుగు రాష్ట్రాల‌తో స‌మానంగా హిందీ బెల్ట్ లో వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. దాదాపు 800 కోట్లతో బాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన తెలుగు డ‌బ్బింగ్ మూవీగా చ‌రిత్ర‌ను సృష్టించింది. ఈ సక్సెస్ తో అల్లు అర్జున్ మ్యాన‌రిజ‌మ్స్‌, బాడీలాంగ్వేజ్‌, డైలాగ్స్‌తో పాటు పాట‌లు సెన్సేష‌న్ అయ్యాయి. అలాగే.. ప‌లువురు ఇంట‌ర్నేష‌న‌ల్ సెలిబ్రిటీలు కూడా అల్లు అర్జున్ మ్యాన‌రిజ‌మ్స్‌ను ఇమిటేట్ చేస్తుంటారు. అయితే.. తాజాగా ప్రధాని మోదీ రీల్‌లో అల్లు అర్జున్ పాట కనిపించడం ట్రెండింగ్ గా మారింది.

Also Read
Kalki2: ప్రభాస్ కల్కి 2 లో ఆలియా భట్? నాగ్ అశ్విన్ ఆలోచనలే వేరబ్బా!
Kalki2: ప్రభాస్ కల్కి 2 లో ఆలియా భట్? నాగ్ అశ్విన్ ఆలోచనలే వేరబ్బా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న AA23 సినిమా. ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే రికార్డుల మోత మోగిస్తోంది. సాధారణంగా సినిమా టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాతే భారీ హైప్ కనిపిస్తుంది. కానీ AA23 విషయంలో మాత్రం కేవలం థీమ్ మ్యూజిక్‌తోనే దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ థీమ్ ట్రాక్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే 12 లక్షలకు పైగా రీల్స్, వీడియోల్లో ఈ మ్యూజిక్ వినిపిస్తూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Allu Arjun s AA23 Theme Goes Viral as PM Modi Uses It in His Instagram Reel
Recommended For You
తమిళనాడు సీఎం అల్లు అర్జున్‌‌.. దళపతి విజయ్ ఎవరో తెలియదంటూ హీరోయిన్ షాకింగ్‌గా
తమిళనాడు సీఎం అల్లు అర్జున్‌‌.. దళపతి విజయ్ ఎవరో తెలియదంటూ హీరోయిన్ షాకింగ్‌గా

అయితే ఈ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఏకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియోకు AA23 థీమ్ మ్యూజిక్‌ను బ్యాక్‌గ్రౌండ్‌గా ఉపయోగించారు. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినీతో జరిగిన భేటీకి సంబంధించిన వీడియోలో ఈ థీమ్ వినిపించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా దృష్టి అంతా AA23పై పడింది. దేశ ప్రధానమంత్రి అధికారిక వీడియోలో ఓ సినిమా థీమ్ వినిపించడం అరుదైన విషయం కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

You May Also Like
OG 2 కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ ప్లాన్.. భారీ ట్విస్ట్‌తో సుజీత్!
OG 2 కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ ప్లాన్.. భారీ ట్విస్ట్‌తో సుజీత్!

ఇక ప్రధాని మోదీ డిజిటల్ టీమ్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కొత్త తరహా వ్యూహాన్ని అనుసరిస్తోంది. యువతను ఆకర్షించే మ్యూజిక్, ఆధునిక విజువల్స్, ట్రెండింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్‌ను ఉపయోగిస్తూ అధికారిక వీడియోలను మరింత ఆకర్షణీయంగా మార్చుతోంది. ఇందులో భాగంగానే అనిరుధ్ రవిచందర్, రిషబ్ రిఖిరామ్ శర్మ, శశ్వత్ సచ్‌దేవ్ వంటి సంగీత దర్శకుల ట్రాక్స్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు AA 23 థీమ్ కూడా అదే జాబితాలో చేరింది.

ఇన్‌స్టా లైవ్‌లో రెచ్చిపోయిన విష్ణుప్రియ.. 'నా బాడీ కౌంట్ 5' అంటూ ఓపెన్ గా..
ఇన్‌స్టా లైవ్‌లో రెచ్చిపోయిన విష్ణుప్రియ.. 'నా బాడీ కౌంట్ 5' అంటూ ఓపెన్ గా..

మరోవైపు అల్లు అర్జున్-అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా'రాకా'షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాతే AA 23 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా సూపర్ హీరో జానర్‌లో ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more about: allu arjun aa23 narendra modi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X