Allu Arjun: దుబాయ్‌లో ఫ్యామిలీ పార్టీలో అల్లు అర్జున్ హంగామా.. శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఫోటోలు వైరల్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ మరికొద్దిరోజుల్లో ఓ ఇంటివాడు కానున్నాడు. తన ప్రియురాలు నైనికను ఆయన పెళ్లాడనున్నారు. దీంతో అల్లు వారి కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌తో వధూవరులు, అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులు సందడి చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా వీరంతా దుబాయ్‌లోనే ఉంటూ సంతోషంగా గడుపుతున్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వేడుకలకు సంబంధించిన అల్లు అర్జున్ పాల్గొన్న ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

మార్చి 6న అల్లు శిరీష్ - నయనికల వివాహం
గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న అల్లు శిరీష్- నయనిక రెడ్డిల పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో గతేడాది వీరిద్దరి నిశ్చితార్ధం ఘనంగా జరిగింది. ఆ వెంటనే అల్లు శిరీష్ - నయనికల వివాహం మార్చి 6వ తేదీన జరిపేందుకు పెద్దలు నిర్ణయించారు. అదే రోజున అల్లు అర్జున్ - స్నేహారెడ్డిల పెళ్లి రోజు కావడం విశేషం. ఇప్పుడే అదే డేట్‌కి తన ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేయనున్నారు అల్లు శిరీష్. దీనికి ముందే దుబాయ్‌లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి ప్లాన్ చేశారు.

Allu Arjun s Photo trending in Allu Sirish pre wedding party in Dubai

స్పెషల్ అట్రాక్షన్‌గా అల్లు అర్జున్
దుబాయ్‌ సముద్ర తీరంలోని ఓ లగ్జరీ యాట్‌పై అల్లు శిరీష్ - నయనికల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. అల్లు బ్రదర్స్ ... అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శిరీష్‌లు ముగ్గురూ ఈ సందర్భంగా షాంపేన్ బాటిల్స్‌ను ఓపెన్ చేస్తూ సందడి చేశారు. ఈ వేడుకలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అల్లు అర్జున్ ఈ సందర్భంగా బ్లాక్ అండ్ గోల్డ్ వెర్సాచే ప్రింటెడ్ సిల్క్ షర్ట్‌లో స్టైలీష్‌గా ఉండగా.. స్నేహారెడ్డి సాఫ్ట్ పింక్ డ్రస్‌లో సందడి చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ధరించిన షర్ట్ ధర టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆ బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఈ షర్ట్ ధర 1.39 లక్షల రూపాయలు. దీంతో బన్నీ మరోసారి ఫ్యాషన్ ప్రియులను ఆకర్షించాడు.

శిరీష్ - నయనికల పెళ్లికి భారీ ఏర్పాట్లు
ఇదిలాఉండగా.. నితిన్ - శాలిని దంపతులు ఏర్పాటు చేసిన పార్టీలో తొలిసారిగా నయనిక రెడ్డి- శిరీష్‌లు కలుసుకున్నారు. ఈ పరిచయం ప్రేమగా మారి కొన్నాళ్లు డేటింగ్ చేసింది ఈ జంట. అనంతరం పెద్దల అంగీకారంతో వీరు పెళ్లి పీటలెక్కనున్నారు. తన తాత, దిగ్గజ హాస్యనటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా గతేడాది అక్టోబర్ 1న.. తాను నయనికను పెళ్లాడనున్నట్లు అల్లు శిరీష్ అధికారికంగా ప్రకటించాడు. అనంతరం వీరిద్దరి నిశ్చితార్ధం ఘనంగా జరిగింది. ప్రస్తుతం అందరి చూపు మార్చి 6వ తేదీన జరిగే అల్లు శిరీష్ - నయనికల పెళ్లిపైనే ఉంది. ఇరు కుటుంబాలు ఈ పెళ్లి వేడుకకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు అల్లు అర్జున్ - నయనిక రెడ్డిల పెళ్లికి తరలిరానున్నారు.

నయనిక బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఇకపోతే.. నయనిక రెడ్డి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి నెటిజన్లు తెగ శోధిస్తున్నారు. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. నయనిక హైదరాబాద్‌కు చెందిన పెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయిగా తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో వీరి కుటుంబానికి భారీ వ్యాపారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక అల్లు శిరీష్ విషయానికి వస్తే.. అల్లు అరవింద్ వారసుడిగా 2013లో గౌరవం సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాడు. ఆ తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్కక్షణం, ఊర్వశివో రాక్షసివో తదితర చిత్రాలతో అలరించాడు. అయితే ఆ తర్వాత వరుసగా ఫ్లాప్స్ రావడంతో కొంతకాలంగా శిరీష్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X