ఆ హీరోతో తేల్చుకొనేందుకు అల్లు అర్జున్ రెడీ.. పుష్ప 2 మూవీకి మరో సమస్య?

సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ, విబేధాలు, ఆధిపత్య పోరు ఉండటం సహజం. ఒక హీరో సినిమా వస్తుందంటే.. ఫ్యాన్స్‌లో సందడి ఎక్కువగానే ఉంటుంది. పండగలు, స్పెషల్ ఈవెంట్స్ సమయంలో అభిమానుల రచ్చ ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇక చాలా కాలంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15 రోజు కోసం పరితపిస్తున్నారు. అయితే పుష్ప 2 సినిమాకు పోటీగా మరో స్టార్ హీరో అదే రోజున సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

పుష్ప: ది రైజ్ సినిమా అల్లు అర్జున్‌కు ఊహించని పాపులారిటీని సంపాదించి పెట్టింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిలో భారీ సక్సెస్ సాధించింది. దాంతో ఐకాన్ స్టార్ ఫాలోయింగ్ ఊహించని విధంగా పెరిగిపోయింది. దాంతో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Allu Arjun s Pushpa 2 box Office Clash with Akshay Kumar s Khel Khel Mein on Independence Day

ఇప్పటికే రిలీజైన పుష్ప 2 ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఇంకా అంచనాలు పెంచింది. పాటలు ప్రోమోలు, గ్లింప్స్, లుక్స్, విడుదలైన అన్నింటికి మంచి క్రేజ్ లభించింది. దాంతో పుష్ప 2 బిజినెస్ కూడా భారీగా జరిగింది. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో అల్లు హీరో ఇమేజ్ పెంచేసిందనే చెప్పాలి.

ఇక పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ సినిమా షూట్ జూలై మొదటివారంలో పూర్తి చేసుకోబోతున్నది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్ పనులతోపాటు ఇతర పోస్టు ప్రొడక్షన్ పనులు యుద్ద ప్రాతిపాదికన జరుగుతున్నాయి. ఆగస్టు 15న సోలో రిలీజ్‌కు సిద్దమైన నేపథ్యంలో మరో బాలీవుడ్ హీరో సినిమా పోటీగా ఎదురు నిలిచింది.

Allu Arjun s Pushpa 2 box Office Clash with Akshay Kumar s Khel Khel Mein on Independence Day

అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ నటించిన ఖేల్ ఖేల్ మే అనే సినిమాను కూడా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ డేట్ వేరే ఉండేది. కానీ లాంగ్ వీకెండ్ కారణంగా ఈ సినిమా రిలీజ్‌ను ముందుకు జరిపారు. దాంతో పుష్ప 2తో ఈ సినిమా పోటీ అనివార్యమైంది.

ఖేల్ ఖేల్ మే సినిమా గురించి టీ సిరీస్ ట్వీట్ చేస్తూ.. కడుపుబ్బ నటించే డ్రామా మూవీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున రిలీజ్ చేస్తున్నాం. ఆ రోజు మీ క్యాలెండర్‌లో మార్క్ చేసుకోండి. ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో కలుద్దాం అని ట్వీట్‌లో పేర్కొన్నారు. దాంతో ఇక పుష్ప 2 వర్సెస్ ఖేల్ ఖేల్ మే అమీ తుమీ తేల్చుకోనున్నారు. ఈ ఫ్రెండ్లీ పోరులో అల్లు అర్జున్, అక్షయ్‌లో ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X