Pushpa 2: పుష్ప 2 రీలోడెడ్.. రన్ టైమ్ పెంచిన మూవీ మేకర్స్.. థియేటర్లలో ఎప్పటి నుంచంటే?
Pushpa2 Run time: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా పుష్ప 2: ది రూల్. ఈ సినిమా ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద గత రికార్డులు బద్దలుకొట్టడమే కాదు.. సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎర్నేని నవీన్, రవి ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమా బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఓ రికార్డును క్రియేట్ చేసింది. ఈ తరుణంలో పుష్ప 2 సినిమా మూవీ మేకర్స్.. పుష్ప 2 రీ లోడెడ్ పేరుతో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఆ నిర్ణయమేమిటంటే?
అల్లు అర్జున్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప 1. ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సిక్వెల్ గా తెరకెక్కిన సినిమా పుష్ప 2 (పుష్ప2 ది రూల్). ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా.. మలయాళ నటుడు పాహద్ ఫాజిల్ ప్రతి నాయకుడి పాత్రలో దుమ్మురేపారు. ఇక టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల కిస్సిక్ అనే స్పెషల్ సాంగ్ లో మాస్ స్టెప్పులేసింది.

ఇక పుష్ప 2 సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా తొలి వారం రూ 726 కోట్లు, రెండో వారం రూ. 265 కోట్లు, మూడో వారంలో రూ. 130 కోట్లు, ఇక నాలుగో వారం రూ. 70 కోట్లు, ఐదో వారం రూ. 20 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా వర్డల్ వైడ్ గా రూ. 1830 కోట్లకు పైగా రాబట్టింది. ఇలా ఎన్నో సినిమాల కలెక్షన్ బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన పుష్ప 2 సినిమా మూవీ మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పుష్ప 2 రీ లోడ్ పేరుతో వరల్డ్ వైడ్ గా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు.
పుష్ప 2 కలెక్షన్ల వసూళ్ల పరంగా రికార్డ్ క్రియేట్ చేయడమే కాదు.. పుష్ప 2 మూవీ రన్ టైంలో కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. పుష్ప 2 సినిమా రన్ టైం ప్రస్తుతం 3 గంటల 20 నిమిషాలు ఉంది. ఇదే అధిక నిడివి గత సినిమాగా పుష్ప 2 ను నిలిపింది. అయితే.. పుష్ప 2 రీలోడ్ అనే పేరుతో మరో 20 నిమిషాల కొత్త సన్నివేశాలను చిత్రంలో జోడించబోతున్నారు. అంటే.. పుష్ప 2 రన్ టైం 3 గంటల 40 నిమిషాలు కాబోతుంది. ఈ యాడ్ చేసిన న్యూ వర్షన్ జనవరి 11 నుండి థియేటర్లలోకి రాబోతుంది. ఈ మేరకు పుష్ప మూవీ మేకర్స్ ప్రకటన విడుదల చేశారు.

ఇప్పటికే పుష్ప 2 ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఇప్పుడు కొత్త సీన్స్ యాడ్ చేయడం ద్వారా థియేటర్లకు ప్రేక్షకులు తిరిగి వస్తారని, తద్వారా కలెక్షన్లు మరింత పెరుగుతాయని మేకర్స్ ఆశిస్తున్నారు. పుష్ప 2 కలెక్షన్లను మరింత పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు . ఈ నిర్ణయంతో పుష్ప 2 సినిమా రూ. 2000 కోట్ల మార్కును ఈజీగా క్రాస్ చేయబోతుందని ఫాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఇప్పటికే నిడివి ఎక్కువగా ఉందంటూ పలువురు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దానికి అదనంగా మరో 20 నిమిషాలు చేరిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరి పుష్ప 2 రీ లోడ్ వెర్షన్ ప్రేక్షకుల నుండి ఎంత ఆదరణ పొందుతుందో వేచి చూడాలి. అలాగే.. బాక్సాఫీస్ వద్ద పుష్ప గాడి రూలింగ్ అలానే కొనసాగుతుందా? లేదా? బ్రేక్ పడుతుందా అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











