Pushpa The Rule : అల్లు అర్జున్‌కు బిగ్‌ షాక్ .. పుష్ప 2ని బాయ్‌కాట్ చేయాలంటోన్న ఆ హీరో ఫ్యాన్స్

2021లో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్ (పుష్ప 1). శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ , గ్యాంగ్‌వార్‌ ఇతివృత్తంతో పీరియాడికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఈ క్రమంలో యావత్ భారత్ దేశం పుష్ప 2 కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

తొలుత ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న పుష్ప-2ని విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. కానీ అనూహ్యంగా డిసెంబర్ 6కి సినిమాను వాయిదా వేయడంతో టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ షాకైంది. ఇంతలో ఈ సినిమాను ఒక రోజు ముందుకు జరిపి అంటే డిసెంబర్ 5వ తేదీన విడుదల చేస్తామని ఇటీవల మరో ప్రకటన చేశారు దర్శక నిర్మాతలు. భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో పుష్ప 2కు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

Allu Arjun s pushpa 2 to be banned in karnataka due to this reason

థియేట్రికల్ రైట్స్ కింద ఏకంగా రూ. 640 కోట్లు, డిజిటల్ రైట్స్‌ రూ. 275 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ.65 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.85 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ. 1065 కోట్ల వ్యాపారంతో పుష్పరాజ్ రికార్డుల దుమ్ముదులిపాడు. అలాగే పుష్ప ది రూల్‌ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11500 థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప 2 చరిత్ర సృష్టించింది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ నెలలో టీజర్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలు ఉండే అవకాశం ఉంది. పాన్ ఇండియా మూవీ కావడంతో హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరులలో ప్రమోషన్ కార్యక్రమాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ ఎత్తున నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఇదిలాఉండగా.. విడుదలకు ముందు పుష్ప 2కి షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే.. దీపావళి కానుకగా కన్నడ హీరో శ్రీమురళి నటించి బఘీరా తెలుగులో రిలీజైన సంగతి తెలిసిందే. అయితే తమ హీరో సినిమాకు తెలుగులో థియేటర్స్ తక్కువ సంఖ్యలో ఇచ్చారని , ఇప్పుడు ఉన్న వాటిలోనూ కోత విధించారని శ్రీమురళి ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. దీంతో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పుష్ప 2ను కర్ణాటకలో బ్యాన్ చేయాలంటూ కన్నడిగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బన్నీ ఫ్యాన్స్ ధీటుగా స్పందిస్తున్నారు. కన్నడిగులతో సోషల్ మీడియాలో వార్‌కు దిగారు. మరి ఈ వివాదం ఎటు వైపు తిరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X