Pushpa 2 Japan Release: జపాన్ భాషలోకి పుష్ప 2.. అల్లు అర్జున్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన పుష్ప ది రైజ్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం పుష్ప ది రూల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి ముస్తాబవుతున్నది. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, రావు రమేష్ తదితరులు నటించారు.
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. మిరోస్లోవ్ క్యుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫిని, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, సీఎస్ సామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. నవీన్ నూలీ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ అందించారు. ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీ, 2024 సంవత్సరంలో రిలీజై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమాను ప్రస్తుతం జపాన్ భాషలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

పుష్ప సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సుమారుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాకు థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 650 కోట్ల రూపాయలు మేర జరిగింది. ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ 275 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకొన్నది.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజైన ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు అందించింది. ఈ సినిమా నిడివిని 200 నిమిషాలు అంటే.. 3 గంటల 20 నిమిషాల రన్ టైమ్‌కు ఫిక్స్ చేశారు. ఈ సినిమా రిలీజైన తర్వాత తొలి ఆట నుంచే హిట్ టాక్‌తో దూసుకెళ్లింది.
పుష్ప 2 చిత్రం తన థియేట్రికల్ రన్‌లో రికార్డు కలెక్షన్లను రాబట్టింది. నైజాంలో 104 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 122 కోట్ల రూపాయలు నెట్, 346 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో 53 కోట్లు, తమిళనాడులో 35 కోట్లు, కేరళలో 7.6 కోట్లు, హిందీలో 390 కోట్లు, ఓవర్సీస్‌లో 130 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 1775 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇలాంటి ఘన విజయం సాధించిన పుష్ప 2 చిత్రాన్ని ప్రస్తుతం జపాన్ భాషలోకి రిలీజ్ చేసేందుకు మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గీక్ పిక్చర్స్, షోచికు డిస్ట్రిబ్యూషన్ సంస్థలతో ఒప్పందం చేసుకొన్నారు. ఈ సినిమాను పుష్ప కున్రిన్ అనే టైటిల్‌తో జపాన్ భాషలో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఈ సినిమాను జనవరి 16వ తేదీన గ్రాండ్‌గా రికార్డు స్క్రీన్లలో రిలీజ్ చేయనున్నారు.
అలాగే జపాన్ స్నేహితులకు నమస్కారం (కొన్నిచివ నిహాన్ నో తుమో యో) అంటూ ఓ సందేశాన్ని రిలీజ్ చేశారు. దాంతోపాటు జపాన్ భాషలో ట్రైలర్, సన్నింగ్ ఫోటోలను విడుదల చేశారు. ఈ సినిమాలో ఇంటర్నేషనల్ ఫ్లేవర్ కూడా ఉండటంతో జపాన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాం. ఈ సినిమాను భారీగా ఆదరిస్తారనే నమ్మకం కూడా ఉంది అని మైత్రీ మూవీస్ నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











