‘ఆ రాష్ట్రంలో 24 గంటలు పుష్ప 2 ప్రదర్శన.. బాహుబలి రికార్డును బద్దలు కొడుతాం..’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ (Pushap 1) చిత్రం రికార్డు కలెక్షన్లతో సంచలనం రేపింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన పుష్ప ది రూల్ చిత్రం డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మాతలు ఎర్నేని నవీన్, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఈ సినిమా విడుదలకు ముందు దేశవ్యాప్తంగా మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వారితో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ..

పుష్ప 1 సినిమా సంచలన విజయం సాధించింది. ఆ మూవీ తర్వాత పుష్ప 2 ఎప్పుడు విడుదల అవుతుందా? అని ప్రేక్షకులు వివిధ రాష్ట్రాల్లో వేచి చూస్తున్నారు. ఇక సినిమాను తొలిసారి బెంగాళీ భాషలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా ఈ చిత్రం అవుట్ బ్రహ్మండంగా వచ్చింది అని నిర్మాతలు తెలిపారు.

Allu Arjun s Pushpa 2 will break all the Records of Baahubali says Pan Indian Distributors in Hyderabad press meet

అయితే పుష్ప 2 సినిమా హిందీ వెర్షన్‌ను నార్త్‌లో విడుదల చేస్తున్న నిర్మాత,డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ మాట్లాడుతూ.. గతంలో బాహుబలి, కేజీఎఫ్, అలాగే పుష్ప సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాం. ఆ సినిమాలకు మించి ఈ చిత్రాన్ని నార్త్, హిందీ వెర్షన్‌ను రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా అతిపెద్ద విజయం సాధించడం ఖాయం అని అన్నారు.

ఇదిలా ఉండగా, తమిళంలో రిలీజ్ చేస్తున్న డిస్టిబ్యూటర్ మాట్లాడుతూ.. మేము తమిళనాడులో ఏ సినిమానైనా రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ చేసిన ట్రాక్ రికార్డు ఉంది. ఇటీవల విజయ్ నటించిన ది గోట్ సినిమాను 806 స్క్రీన్లలో రిలీజ్ చేశాం. ఈ సినిమాను కూడా అంతకుమించి విడుదల చేస్తాం. ఇప్పటి వరకు 80 కోట్ల రూపాయల షేర్ బాహుబలి మూవీ కలెక్ట్ చేసింది. ఆ రికార్డును బద్దలు కొడుతాం అని మాలి అన్నారు.

Allu Arjun s Pushpa 2 will break all the Records of Baahubali says Pan Indian Distributors in Hyderabad press meet

ఇక మలయాళంలో పుష్ప 2ను రిలీజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతూ.. ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమాను 24 గంటలపాటు నడిపించేలా షోలను ప్లాన్ చేస్తున్నాం. ఇక ఈ మూవీ ద్వారా 12 కోట్ల రూపాయల షేర్ టార్గెట్‌గా పెట్టుకొన్నాం. ఆ టార్గెట్‌ను అధిగమిస్తాం అని డిస్ట్రిబ్యూటర్ ముఖేష్ మెహతా తెలిపారు.

ఇక కన్నడలో గతంలో అత్యధికంగా 95 కోట్ల బిజినెస్‌ను ఓ హీరో చేశాడు. అంతకుమించి పుష్ప 2 కలెక్షన్లు సాధించేలా ఈ మూవీ విడుదలను ప్లాన్ చేస్తాం. గతంలో కేజీఎఫ్‌ను 2350 స్క్రీన్లలో విడుదల చేశాం. ఈ మూవీని 2500 స్క్రీన్లలో రిలీజ్ చేస్తాం అని కన్నడ డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. కేజీఎఫ్ 2 సినిమా తొలి రోజు30 కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డును మేము అధిగమిస్తాం అని అన్నారు.

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2 baahubali 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X