మరో రికార్డును అందుకున్న పుష్పరాజ్: అన్ని భాషల్లోనూ హవా చూపిస్తోన్న అల్లు అర్జున్
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా రేంజ్ చిత్రాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు టాలీవుడ్ స్టామినా గణనీయంగా పెరిగింది. దీంతో మన సినిమాలకు దేశ వ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. ఈ కారణంగానే మన పరిశ్రమకు చెందిన దర్శక నిర్మాతలు అందరూ పాన్ ఇండియా చిత్రాలపై ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగులో ఎన్నో ఆ తరహా సినిమాలు పట్టాలపై ఉన్నాయి. అందులో టాలీవుడ్ బడా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సీనియర్ డైరెక్టర్ లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న 'పుష్ప.. ద రైజ్' ఒకటి.
గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'పుష్ప' మూవీపై అన్ని ఇండస్ట్రీలూ దృష్టి సారించాయి. మాస్ యాక్షన్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన 90 శాతం షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్ కోసం దాదాపు 30 శాతం చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు ఈ మూవీ బ్యాలెన్స్ పార్ట్ కోసం షూట్ శరవేగంగా సాగుతోంది.
ఈ సినిమాకు సంబంధించిన మొదటి పార్ట్‌ను 'పుష్ప ద రైజ్' పేరిట క్రిస్ట్‌మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన ప్రచార చిత్రాలు, పాటలను కూడా ఇప్పటికే విడుదల చేశారు. అందులో 'Introducing Pushpa Raj' అనే వీడియోను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. అంతేకాదు, టాలీవుడ్‌లో అత్యధిక వ్యూస్ అందుకున్న టీజర్‌గా ఇది మర్చిపోలేని ఘనతను కూడా ఎప్పుడో అందుకుంది.

ఇక, ఇటీవలే 'పుష్ప' సినిమాలోని ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక విడుదలైంది. ఐదో భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సింగిల్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా సౌత్‌లో ఎక్కువ వ్యూస్ రాబట్టిన పాటగా ఇది రికార్డులకెక్కింది. అలాగే, లైకులు కూడా భారీగానే సంపాదించుకుని ఈ పాట సత్తా చాటింది. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట తాజాగా అన్ని భాషల్లో కలిపి 80 మిలియన్ వ్యూస్‌ను అందకుంది. దీంతో ఇది ఆయా భాషల్లో పలు రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు సినిమాపై అంచనాలను కూడా భారీ స్థాయిలో పెంచేసింది. ఫలితంగా ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే, వర్ష బొల్లమ్మ కూడా నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











