‘పుష్ప’లో ఆ ఒక్క దానికే రెండు కోట్లు: సినిమా మొత్తానికే హైలైట్ కాబోతుందట

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన 'అల.. వైకుంఠపురములో' మూవీతో గత ఏడాది ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ రిజల్ట్ ఇచ్చిన జోష్‌లో ఉన్న అతడు.. ఆ వెంటనే మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి 'పుష్ప' అనే సినిమాను పట్టాలెక్కించేశాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. ఇందులో ఫస్ట్ పార్ట్‌ను క్రిస్టమస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

'పుష్ప' మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను ఫస్ట్ సింగిల్‌తో ప్రారంభించబోతోంది చిత్ర యూనిట్. దేవీ శ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా దీనికి సంబంధించిన ప్రకటన వచ్చింది. ఇందులో భాగంగానే ఈ సినిమాలోని మొదటి పాట 'దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొడుతుంది పీక'ను ఆగస్టు 13న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. దానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ పాటను విశాల్ దద్లానీ (హిందీ), విజయ్ ప్రకాశ్ (కన్నడ), రాహుల్ నంబియార్ 'మలయాళం), శివమ్ (తెలుగు), బెన్నీ దయాల్ (తమిళం)లు పాడారు.

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. 'పుష్ప' మూవీలో ఈ పాట అదిరిపోయేలా ఉంటుందట. కేవలం ఈ ఒక్క సాంగ్ కోసమే చిత్ర యూనిట్ ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిసింది. అందుకు అనుగుణంగానే ఇది సూపర్‌గా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. అంత డబ్బును వెచ్చించారు కాబట్టే మొత్తంగా ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. దీంతో కొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న ఈ పూర్తి పాట కోసం అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సాంగ్ మరోసారి ట్రెండ్ అవుతోంది.

Allu Arjuns Pushpa Makers spent Rs 2 crores for DaakkoDaakkoMeka Song

ఇది మాత్రమే కాదు.. 'పుష్ప' సినిమాలోని అన్ని పాటలనూ అదిరిపోయేలా కంపోజ్ చేశాడట మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. ఇవన్నీ ఫాస్ట్ బీట్‌తో సాగుతాయని, వీటిలో అల్లు అర్జున్ డ్యాన్స్ మూమెంట్స్ అద్భుతంగా ఉంటాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక, ఈ మూవీ ఆల్బమ్‌లో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ బన్నీతో కలిసి చిందులు వేయబోతుందని ప్రచారం జరుగుతోంది.

భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌ పుష్పరాజ్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం అతడు ఎన్నో సాహసాలు సైతం చేస్తున్నాడు. అలాగే డీ గ్లామర్ లుక్‌తో కనిపిస్తున్నాడు. సామాన్య లారీ డ్రైవర్ నల్లమల ప్రాంతంలో డాన్‌గా ఎలా ఎదిగాడు అన్న కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. అనసూయ కీలక పాత్రను పోషిస్తోంది.

బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X