‘పుష్ప’ ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు: మొదటి దానితోనే మెస్మరైజ్ చేయాలని అలా

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో పాన్ ఇండియా రేంజ్ చిత్రాలు రూపొందుతున్నాయి. అందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న 'పుష్ప' ఒకటి. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తీస్తున్నాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఈ సినిమా రాబోతుంది. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక, తాజాగా 'పుష్ప' గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప'కు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలను కూడా రెడీ చేసి పెట్టేశాడు. వాటికి సంబంధించిన షూటింగ్ కూడా దాదాపుగా పూర్తైంది. ఈ చిత్రాన్ని ఎంతో ఛాలెంజ్‌గా తీసుకున్న డీఎస్పీ అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేసినట్లు ఎప్పటి నుంచో చెబుతున్నాడు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ జూలై మొదటి వారంలో రాబోతుందట. మొదటి దానితోనే మెస్మరైజ్ చేయాలన్న ఉద్దేశంతో మాంచి మాస్ బీట్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నారని తెలిసింది.

Allu Arjuns Pushpa Movie First Song Will Be Release On July First Week

పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'పుష్ప'లో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌ పుష్పరాజ్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం అతడు ఎన్నో సాహసాలు సైతం చేస్తున్నాడు. అలాగే డీ గ్లామర్ లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. అనసూయ కీలక పాత్రను పోషిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X