twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమెజాన్‌లో దర్శనమిచ్చిన ‘పుష్ప’ పోస్టర్స్: వైరల్ అవుతోన్న ఆదిత్య మ్యూజిక్ ట్వీట్

    |

    గత ఏడాది సంక్రాంతికి 'అల.. వైకుంఠపురములో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఫలితంగా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడీ స్టార్ హీరో. ఈ ఉత్సాహంతోనే అల్లు వారి అబ్బాయి.. ఆ వెంటనే 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కిస్తోన్న 'పుష్ప'లో నటిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో రాబోతున్న ఈ సినిమా గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న విషయం తెలిసిందే.

    కాలేజ్‌ టైమ్‌లో అలాంటి పనులు.. ఆ ఉద్దేశం లేకపోయినా: నిరుపమ్ భార్య మంజుల షాకింగ్ కామెంట్స్కాలేజ్‌ టైమ్‌లో అలాంటి పనులు.. ఆ ఉద్దేశం లేకపోయినా: నిరుపమ్ భార్య మంజుల షాకింగ్ కామెంట్స్

    భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన 90 శాతం షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్‌ కోసం దాదాపు 30 శాతం చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు మొదటి దాని కోసం షూట్ చేస్తున్నారు. ఇక, మొదటి భాగాన్ని 'పుష్ప.. ద రైజ్' పేరిట వచ్చే క్రిస్టమస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. దీంతో ఈ సినిమా కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు.

    Allu Arjuns Pushpa Movie Posters on Amazon Website

    బన్నీ నటిస్తోన్న 'పుష్ప' సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం 'Introducing Pushpa Raj' అనే వీడియోను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. ఇక, ఇటీవలే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఐదో భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సింగిల్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా సౌత్‌లో ఎక్కువ వ్యూస్ రాబట్టిన పాటగా ఇది రికార్డులకెక్కింది. అలాగే, లైకులు కూడా భారీగానే సంపాదించుకుని సత్తా చాటిందీ పాట.

    అందాలు ఆరబోసి షాకిచ్చిన రష్మిక మందన్నా: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు!అందాలు ఆరబోసి షాకిచ్చిన రష్మిక మందన్నా: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు!

    అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీతనంతో రాబోతున్న 'పుష్ప' మూవీకి సంబంధించిన పోస్టర్లు తాజాగా ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ సంస్థలో దర్శనమిచ్చాయి. దీంతో ఈ సినిమా రేంజ్ ఏ మేరలో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక, టాలీవుడ్ నుంచి అమెజాన్‌లో కనిపించిన ఏకైక సినిమాగా పుష్ప రికార్డులకెక్కింది. ఈ పోస్టర్లను చూసిన బన్నీ అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు. అదే సమయంలో ఆదిత్య మ్యూజిక్ సంస్థ కూడా దీనిపై స్పందించింది. 'అమెజాన్‌లో పుష్ప బ్యానర్ చూడడం సంతోషంగా ఉంది. ఇందులో కనిపించిన మొట్టమొదటి సినిమా ఇదే. ఈ సినిమాను ప్రోత్సహిస్తున్నందుకు ఆదిత్య మ్యూజిక్ సంస్థ తరపు నుంచి అమెజాన్ వాళ్లకు ధన్యవాదాలు' అని ట్వీట్ చేసింది.

    Allu Arjuns Pushpa Movie Posters on Amazon Website

    క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది.

    English summary
    Tollywood Star Hero Allu Arjun Doing Pushpa Under Creative Director Sukumar Direction. Now This Movie Posters Placed on Amazon Website.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X