11500తో అల్లు అర్జున్ మాస్ రికార్డ్.. ఆర్ఆర్ఆర్, కల్కి, బాహుబలి ఔట్ ... పుష్ప 2 రేర్ ఫీట్
సరిగ్గా మూడేళ్ల క్రితం స్టైలీష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్‌ని ఐకాన్ స్టార్‌గా, పాన్ ఇండియా హీరోగా మార్చింది పుష్ప ది రైజ్ (పుష్ప 1). క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యావత్ భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసిన సంగతిని ఎవరూ మరిచిపోరు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఇతివృత్తంతో పీరియాడికల్ మూవీగా తెరకెక్కిన పుష్ప బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తెలుగు సినిమా సత్తాను మరోసారి చాటి చెప్పింది. ఈ క్రమంలో పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
తొలుత ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న పుష్ప-2ని విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. కానీ అనూహ్యంగా పుష్ప-2 విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా దర్శక నిర్మాతలు సంచలన ప్రకటన చేయడంతో చిత్ర పరిశ్రమ , అభిమానులు షాకయ్యారు. ఈ మూవీని డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.

అయితే ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి తరపున అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో మెగా , పవన్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ పరిస్ధితుల్లో పుష్ప 2ని రిలీజ్ చేస్తే నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని మేకర్స్ భావించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ పుష్ప 2 వాయిదా పడటానికి అసలు కారణాలేంటీ అనేది మాత్రం బయటకు రాలేదు. కానీ పుష్ప ది రూల్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమాను ఒక రోజు ముందుకు అంగే డిసెంబర్ 5వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
ఇంతటి భారీ హైప్ ఉన్న నేపథ్యంలో పుష్ప 2కు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఏపీ , తెలంగాణ థియేట్రికల్ హక్కులు రూ.220 కోట్లు, తమిళనాడు రూ. 50 కోట్లు, కర్ణాటక రూ. 30 కోట్లు, కేరళ రూ.20 కోట్లు మేర అమ్ముడయ్యాయి. హిందీ రూ.200 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ.120 కోట్ల చొప్పున బిజినెస్ చేసింది. మొత్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కింద ఏకంగా రూ. 640 కోట్ల వ్యాపారం చేసింది. నాన్ థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ. 275 కోట్లకు దక్కించుకుంది. మ్యూజిక్ రైట్స్ రూ.65 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.85 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ. 1065 కోట్ల వ్యాపారంతో పుష్పరాజ్ రికార్డుల దుమ్ముదులిపాడు.
తాజాగా అల్లు అర్జున్ తన పేరిట మరో రికార్డును నెలకొల్పారు. పుష్ప 2ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11500 థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. మొత్తం ఆరు భాషలలో 11,500 స్క్రీన్స్‌లలో పుష్ప 2ను ప్రదర్శించనున్నారు. ఇండియాలో 6500.. ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్‌లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప 2 చరిత్ర సృష్టించింది. ఇంత భారీగా రిలీజ్ కానుండటంతో పుష్ప ది రూల్ అదిరిపోయే ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











