అమ్మమ్మ చివరి చూపు కోసం రామ్ చరణ్.. ఎదురెళ్లి హత్తుకున్న అల్లు అర్జున్, ఒక్క హగ్‌తో
మెగా హీరోలు రామ్ చరణ్ - అల్లు అర్జున్ చాలా రోజులుగా ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉంటున్నరంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో మెగా హీరోల ఈవెంట్స్, రెండు కుటుంబాల్లో జరిగే శుభకార్యాలలో అల్లు అర్జున్, రామ్ చరణ్ ఖచ్చితంగా పాల్గొనేవారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య అలాంటి సఖ్యత లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మెగా, అల్లు కుటుంబాల సన్నిహితులు మాత్రం అలాంటిదేమీ లేదని, ఇద్దరూ బాగానే ఉంటున్నారని చెబుతున్నారు.
చరణ్‌కు విష్ చేయని అర్జున్
పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ ఈవెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ వైఖరి మెగా ఫ్యామిలీని ముఖ్యంగా రామ్ చరణ్‌ను బాగా హర్ట్ చేసిందని ఫిలింనగర్‌లో చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఏడాది రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ సోషల్ మీడియా వేదికగా గ్లోబల్ స్టార్‌కు విషెస్ తెలియజేశారు. కానీ బన్నీ మాత్రం కనీసం మాట మాత్రంగానైనా చిన్న పోస్ట్ కూడా పెట్టలేదు. టాలీవుడ్‌లో సీనియర్లు, జూనియర్ హీరోల పుట్టినరోజులు, ఇతర ప్రత్యేక దినాలకు ఖచ్చితంగా విష్ చేసే అల్లు అర్జున్.. చరణ్ పుట్టినరోజును మిస్ చేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది.

గేమ్ ఛేంజర్‌పై నెగిటివ్ పబ్లిసిటీ
ఇక ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ కూడా అగ్నికి ఆజ్యం పోస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమాపై దారుణంగా నెగిటివ్ ట్రోలింగ్ జరగడం, అలాగే ఈ సినిమా హెచ్‌డీ ప్రింట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం వెనుక అల్లు ఆర్మీ ఉందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఇవన్నీ మెగా - అల్లు కుటుంబాల మధ్య గ్యాప్‌కు కారణంగా తెలుస్తోంది. అందుకే చరణ్ - అల్లు అర్జున్‌లు ఒకరికొకరు దూరమైనట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అల్లు అరవింద్‌తో చరణ్‌కు బాండింగ్
అయితే అల్లు అర్జున్ తండ్రి, తన మేనమామ అల్లు అరవింద్ అంటే మాత్రం రామ్ చరణ్‌కు చాలా ఇష్టం. పార్టీలు, పబ్‌లకు వెళ్లాల్సి వస్తే తాను ఖచ్చితంగా అరవింద్ మామతోనే వెళ్తానని పలుమార్లు రామ్ చరణ్ వెల్లడించారు. కానీ చరణ్ - అర్జున్ మాత్రం మునుపటిలా ఉండలేకపోవడం అభిమానులను బాధిస్తోంది. అయితే చాలా రోజుల తర్వాత బావ బామ్మర్ధులు కలుసుకుని తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని రుజువు చేశారు.
అల్లు అర్జున్‌ని ఓదార్చిన చరణ్
దివంగత అల్లు రామలింగయ్య సతీమణి, తనకు స్వయానా అమ్మమ్మ అయిన అల్లు కనకరత్నమ్మ ఆగస్ట్ 29న కన్నుమూయడంతో పెద్ది సినిమా షూటింగ్‌లో భాగంగా మైసూర్‌లో ఉన్న చరణ్.. అన్ని పనులను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు. అమ్మమ్మ చివరి చూపు కోసం ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్న రామ్ చరణ్ కారు దిగానే అల్లు అర్జును ఎదురెళ్లి రిసీవ్ చేసుకున్నారు. చరణ్ కూడా బన్నీని హత్తుకుని ఓదార్చారు. అనంతరం తన మేనమామ అల్లు అరవింద్, తల్లి సురేఖకు ధైర్యం చెప్పి బంధుమిత్రులను పరామర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మెగా- అల్లు కుటుంబాలు వేరు కాదని ఒకటేనని వీరిద్దరూ మరోసారి నిరూపించారు.


Click it and Unblock the Notifications











