అల్లు అర్జున్ కంటతడి.. చిరంజీవి ఓదార్పుతో ఎమోషనల్‌గా ఐకాన్ స్టార్
మెగా- అల్లు ఫ్యామిలీల మధ్య మునుపటి మాదిరిగా పరిస్ధితులు లేవని సినీ వర్గాల్లో వినిపిస్తోన్న మాట. దీనికి కారణం అల్లు అర్జున్, ఆయన వ్యవహారశైలి. మెగా హీరో అన్న ఇమేజ్‌కు దూరంగా తనకంటూ సెపరేట్ బ్రాండ్ సృష్టించే పనిలో అల్లు అర్జున్ ఉన్నారని ఫిలింనగర్‌లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అప్పుడెప్పుడో చెప్పును బ్రదర్ ఇన్సిడెంట్ నుంచి ఎన్నికల్లో జనసేన పార్టీని కాదని, వైసీపీకి మద్ధతు పలికే వరకు అల్లు అర్జున్ వైఖరి తీవ్ర చర్చనీయాంశమైంది.
మెగా ఫ్యామిలీకి దూరంగా అల్లు అర్జున్
అల్లు అర్జున్ వ్యవహరశైలితో మెగా ఫ్యామిలీ ఆయనను దూరం పెట్టినట్లుగా కథనాలు వచ్చాయి. అదే సమయంలో నాగబాబు ట్వీట్ మెగా- అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ మరింత పెంచింది. అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతుల సోషల్ మీడియా ఖాతాలను హీరో సాయి దుర్గా తేజ్ అన్ ఫాలో చేయడం కలకలం రేపింది. ఆ తర్వాత మెగాస్టార్ ఇంట్లో జరిగిన పవన్ కళ్యాణ్ విక్టరీ సంబరాల్లోనూ అల్లు ఫ్యామిలీ జాడ లేదు. తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా అల్లు కాంపౌండ్ నుంచి ఎవ్వరూ కనిపించలేదు.

చరణ్‌తోనూ గ్యాప్
ఈ గొడవల్లో రామ్ చరణ్‌కు అల్లు అర్జున్ మధ్య కూడా బాగా గ్యాప్ వచ్చినట్లుగా ఫిలింనగర్‌లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ప్రతి పండక్కి, పర్వదినాలకు, పుట్టినరోజు వేడుకలకు చరణ్- అర్జున్ కలిసే హాజరయ్యేవారు. అలాగే ఒకరి పుట్టినరోజులకు మరొకరు విషెస్ చేసుకుంటూ ఉండేవారు. మెగా- అల్లు ఫ్యాన్ వార్ కూడా ఇద్దరి మధ్యా మనస్పర్ధలు చోటు చేసుకుంటున్నాయని కొందరు చెబుతున్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్‌తో రంగంలోకి చిరంజీవి
అయితే సంథ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో అల్లు కుటుంబానికి మెగా ఫ్యామిలీ అండగా నిలిచింది. చిరంజీవి, సురేఖలు స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి కుటుంబానికి ధైర్యం చెప్పారు. దీంతో బెయిల్‌పై బయటకు వచ్చిన వెంటనే చిరంజీవి, నాగబాబు ఇళ్లకు నేరుగా వెళ్లిన బన్నీ.. వారితో మనసు విప్పి మాట్లాడారు. ఆ తర్వాత ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లోనూ తను చిరంజీవిగారిని చూసే హీరో అవ్వాలని కలలు గన్నానని చెప్పారు అల్లు అర్జున్. ఈ ఏడాది ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనను విష్ చేయడంతో పాటు అదే రోజు సాయంత్రం జరిగిన పార్టీకి భార్యతో కలిసి హాజరయ్యారు. తాజాగా చిరంజీవి, అల్లు అర్జున్ ఒకేచోట కనిపించారు.
అల్లు అర్జున్‌ను ఓదార్చిన మెగాస్టార్
స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నాయనమ్మ అల్లు కనకరత్నమ్మ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. అత్తగారి మరణవార్త తెలుసుకున్న చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి స్వయంగా అల్లు అరవింద్ నివాసానికి చేరుకుని ఆయనను ఓదార్చారు. అటు నాయనమ్మ మరణంతో ముంబైలో షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ అర్ధాంతరం దానిని క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయనను పలువురు సినీ ప్రముఖులు ఓదార్చి ధైర్యం చెప్పారు. ఇంట్లోకి వెళ్లేసరికి చిరంజీవి, త్రివిక్రమ్, బీవీఎస్ రవిలు కనిపించడంతో వారి వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ని చిరంజీవి ఓదార్చగా.. బన్నీ ఒక్కసారగా ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బయట చక్కర్లు కొడుతున్నట్లుగా మెగా- అల్లు ఫ్యామిలీల మధ్య ఎలాంటి వివాదాలు లేవని ఈ ఘటనతో తేలిపోయింది.


Click it and Unblock the Notifications











