సాయి ధరమ్ తేజ్ చెప్పిన ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకండి.. అల్లు హీరో స్వీట్ కౌంటర్
మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇటీవల నిహారిక పెళ్లిని గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయ్ పూర్ లో జరిగిన ఆ పెళ్లిలో దాదాపు 150మందికి పైగా పాల్గొన్నారు. లాక్ డౌన్ తరువాత మొదటిసారి అందరు ఒకే చోట కలవడంతో ఒక పండగలా వేడుక జరిగింది. అయితే పెళ్లి అయిపోయిన తరువాత త్వరలో మెగా ఫ్యామిలీలోనే మరో పెళ్లి కూడా జరగనున్నట్లు టాక్ వచ్చింది. ఆ రూమర్స్ కు సాయి ధరమ్ తేజ్ కూడా ఇటీవల బూస్ట్ ఇచ్చాడు.

మెగా ఫ్యామిలో మరో పెళ్లి..
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నెక్స్ట్ మెగా ఫ్యామిలిలో జరగబోయే పెళ్లిపై సాయి ధరమ్ తేజ్ చాలా క్లారిటీగా వివరణ ఇచ్చాడు. ముందుగా తన పెళ్లి జరగనున్నట్లు వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ నాది ఇప్పట్లో జరగదని కుండబద్ధలు కొట్టేశాడు. ఎందుకంటే తనకంటే పెద్దవాడు శిరీష్ ఉన్నట్లు తెలియజేశాడు.

ఇప్పట్లో నా పెళ్లి కాదు..
తన పెళ్లి మాత్రం ఇప్పట్లో జరగదని అంటూ అంతకంటే ముందు మరొకరు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. వచ్చే ఏడాది అల్లు శిరీష్ పెళ్లి జరుగుతుందని అందుకు ప్లాన్స్ కూడా జరుగుతున్నట్లు వివరణ ఇచ్చిన సాయి శిరీష్ తనకంటే పెద్దవాడు కాబట్టి ముందు అతనిదే జరుగుతుందని ఇక నా పెళ్లికి ఇంకా సమయం ఉందని అన్నాడు. అలాగే.. ఇంకా కొన్ని పూర్తి చేయాల్సిన డ్రీమ్స్ కూడా ఉన్నాయని సాయి ధరమ్ వివరణ ఇచ్చాడు.

కుండబద్దలు కొట్టిన శిరీష్
ఇక సాయి ధరమ్ తేజ్ చేసిన కామెంట్స్ కు ఒక విధంగా అల్లు శిరీష్ స్వీట్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పెళ్లికి రెడీగా ఉన్న వారిలో అల్లు శిరీష్ మెగా ఫ్యామిలిలో ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి. అతని వయసు 33ఏళ్ళు. ఇక తేజ్ చేసిన కామెంట్స్ నిజమని అనుకుంటున్నా తరుణంలో అతని మాటలు సీరియస్ గా తీసుకోవద్దని అంటూ శిరీష్ కుండబద్దలు కొట్టేశాడు.

నా ఇష్టం ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటా
ట్విట్టర్ ద్వారా శిరీష్ ఈ విదంగా స్పందించాడు. 'హహహ.. తేజు నా పెళ్లి విషయంలో ఎదో జోక్ చేసినట్లు ఉన్నాడు. దాన్ని మీరు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు అనిపించింది. నేను సింగిల్ గా ఉండేందుకు ఇష్ట పడుతున్నాను. ఆ విషయంలో మా అమ్మా నాన్న నుంచి కూడా ఇబ్బంది లేదు. నేను నాకు ఇష్టం కలిగినప్పుడు పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నేనే ఆ విషయాన్ని చెబుతాను' అంటూ వివరణ ఇచ్చాడు శిరీష్.


Click it and Unblock the Notifications











