విడుదల తేదీ ఖరారు చేసుకున్న అల్లు శిరీష్ 'ఎబిసిడి'!

మెగా హీరో అల్లు శిరీష్ ఈ సారి 'ఎబిసిడి' అంటూ రాబోతున్నాడు. ఎబిసిడి అనేది మలయాళంలో ఘనవిజయం సాధించిన చిత్రం. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఎబిసిడి.. అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి రాజీవ్ రెడ్డి దర్శత్వం వహిస్తున్నారు. రుక్సార్ దిల్లోన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో విజయం అందుకున్న శిరీష్ తదుపరి చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

Allu Sirish ABCD movie new release date announced

ఎబిసిడి చిత్రం ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. వాస్తవానికి ఈ చిత్రం మార్చిలోనే విడుదల కావాల్సింది. అనుకోని కారణాల వల్ల ఏప్రిల్ కు వాయిదా వేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదలవుతుండగా ప్రచారం జరిగింది. ఆ తేదీ కూడా వాయిదా పడింది. తాజాగా చిత్ర యూనిట్ ఎబిసిడి కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. మే 17న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అల్లు శిరీష్ ట్విట్టర్ లో ప్రకటించాడు.

త్వరలో థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల చేయనున్నట్లు శిరీష్ తెలిపాడు. వెంకీ, రెడీ లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మాస్టర్ భరత్ ఈ చిత్రంలో అల్లు శిరీష్ ఫ్రెండ్ పాత్రలో నటిస్తుండడం విశేషం. మలయాళీ చిత్రం ఎబిసిడిలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. అక్కడ ఎబిసిడి ఘనవిజయం సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X